తెలంగాణ

ఆర్టీసీలో జోనల్ వ్యవస్థ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జోనల్ వ్యవస్థను రద్దు చేసినట్టు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జివి.రమణారావు తెలిపారు. ఇది దీపావళి నుంచి అమల్లోకి వస్తందని, దీంతో ఆర్టీసీకి కొంత మేర వ్యయభారం తగ్గుతుందని చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దూరప్రాంత ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని, రద్దీని దృష్టిలో పెట్టుకొని త్వరలో హైదరాబాద్-నిజామాబాద్ మధ్య మినీ ఏసి బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని బయో డీజిల్ బస్సులను నడుపుతున్నామని, కొత్త సర్వీసులను దీపావళి నాటికి ప్రవేశపెడతామని, ఇవి హైదరాబాద్ నుంచి వరంగల్, హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. ఏసి మినీ బస్సుల సమాచారం, బుకింగ్ కోసం యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు చెప్పారు. ముందుగా మహీంద్రా కంపెనీకి చెందిన కొన్ని ఏసి మినీ బస్సులను ప్రవేశపెడతామని, ప్రయాణికుల ఆదరణను బట్టి వీటి సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. స్కానియా కంపెనీ చెందిన రెండు బయో డీజిల్ రెండు బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని, వీటి వలన పర్యావరణానికి ఎటువంటి హానీ ఉండదని రమణరావు తెలిపారు. దసరా సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని, రోజూ 1026 ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులకు సేవలందిస్తున్నామని వివరించారు.