తెలంగాణ

నందినె్నలో జనం ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 10: గద్వాల నియోజకవర్గం గట్టు మండలంలో నందినె్న మండలాన్ని కొత్త మండలాల జాబితాలో లేకపోవడంతో గ్రామస్థులు అగ్రహోదగ్రులయ్యారు. సోమవారం రాత్రి నందినె్న మండలాన్ని ప్రభుత్వం ప్రకటించకపోడంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. గద్వాల డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులకు జనం నిప్పంటించారు. దీంతో రెండు ఆర్టీసీ బస్సులు ప్రజల ఆగ్రహనికి ఆహుతయ్యాయి. గత రెండు నెలల నుండి నందినె్న మండలం అవుతుందని అంతా భావించారు. తొలి నోటిఫికేషన్‌లో సైతం నందినె్న మండలం ప్రకటించడం దాంతో పలుమార్లు అధికారులు సైతం అక్కడికి వెళ్లి పలు కార్యాలయాల ఏర్పాటుపై ఆరా తీశారు. తద్వారా జరిగిన పరిణామాల దృష్ట్యా కొత్త మండలాల జాబితాలో నందినె్న మండలం లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు చిన్నాపెద్ద ఆడమగ తేడా లేకుండా రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగి గద్వాల డి పోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పట్టించి నిరసనను తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. గ్రామంలో తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.