తెలంగాణ

చెరువులో పడి తల్లీ బిడ్డల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం, అక్టోబర్ 10: చిన్నారి చెల్లెలిని కాపాడడం కోసం అక్క.. ఆ ఇద్దరి రక్షించుకోవాలని కన్నతల్లి పడిన ఆరాటంలో అంతా మృత్యువు వికటాట్టహాసానికి బలైన విషాద సంఘటన ఇది. పండుగ ముందు రోజు సోమవారం ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం సూరవీడుకాలనీలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతకడానికి పిల్లలతో కలిసి వెళ్లిన ఓ తల్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి బిడ్డలతో సహా మృత్యువు పాలయింది. ఈ ఘటనతో సూరవీడు కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సూరవీడు కాలనీకి చెందిన ఉయికా కోమల(35) తన కుమార్తెలు పింకు(6), లహరి(15)లతో కలిసి బట్టలు ఉతికేందుకు ఊరు సమీపంలోని కారంకుంట చెరువుకు వెళ్లింది. ఆమె బట్టలు ఉతుకుతుండగా చిన్న కూతురు పింకు ఆడుకుంటూ నీళ్లలోకి దిగింది. మునిగిపోతుండగా గమనించిన అక్క లహరి చెల్లిని కాపాడేందుకు నీళ్లలోకి దూకింది. ఇద్దరూ మునుగుతున్నట్లుగా అక్కడికి 20 అడుగుల దూరంలో బట్టలు ఉతుకుతున్న తల్లి చూసి పరుగు పరుగున అక్కడికి చేరుకుంది. కన్నబిడ్డలను కాపాడే ప్రయత్నంలో ఆమె కూడా నీళ్లలో కొట్టుకుపోయింది.
సంఘటన ప్రదేశానికి కొద్ది దూరంలోనే భర్త రామారావు వ్యవసాయ పనిలో ఉన్నాడు. బట్టలు ఉతుకుతున్న భార్య, ఆమెతో వచ్చిన పిల్లలు కన్పించడం లేదన్న అనుమానంతో చెరువు వద్దకు రాగా వారు విగతజీవులుగా కనిపించారు.