తెలంగాణ

ఆనాటి ఆ స్నేహమానందగీతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం సాయంత్రం మెదక్ జిల్లా ములుగు మండలం మర్కుక్ గ్రామంలోని మహేందర్‌రెడ్డి అనే చిరకాల మిత్రుని ఇంటికి వెళ్లి అతిథి మర్యాదలు స్వీకరించారు. ఎంతో ఆతృతగా ఆప్త మిత్రుని కోసం ఎదురుచూసిన మహేందర్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు సిఎం రాకతో ఎదురేగి పుష్పగుచ్చాన్నిచ్చి సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం గృహంలో తేనీటి విందును స్వీకరించి ఒకరికొకరు యోగ క్షేమాలను తెలుసుకున్నారు. మర్కుక్ గ్రామాన్ని మండలంగా చేసినట్లు సిఎం కెసిఅర్ మిత్రునికి తెలుపుతూ ఇంటి వెనకాల ఉన్న గృహాన్ని తహశీల్దార్ కార్యాలయంగా ఏర్పాటు చేస్తున్నట్లు మిత్రునికి తెలిపారు. అలాగే గ్రామాభివృద్దిలో అందరి సహకారం కావాలని సిఎం తెలుపగా మహేందర్‌రెడ్డితోపాటు గ్రామస్థులందరూ తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు.
అనంతరం మహేందర్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ముచ్చటించి గ్రూప్‌ఫొటోను దిగారు. తర్వాత ముఖ్యమంత్రి అక్కడి నుంచి ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రోనాల్డ్‌రాస్, గఢా అధికారి హన్మంతరావు, జెడ్‌పిటిసి సింగం సత్తయ్య, సర్పంచ్ నర్సింలు, ఎంపిటిసి గీతారాంరెడ్డి, ఉప్పసర్పంచ్ నవనీత మాధవరెడ్డి, ఎంఅర్‌ఓ శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ పరమేశం, శ్రీనివాస్‌రెడ్డి, గామస్తులు పాల్గొన్నారు.

సిఎం కెసిఅర్‌కు స్వాగతం పలుకుతున్న మహేందర్‌రెడ్డి... మహేందర్‌రెడ్డి కుటుంబసభ్యులతో గ్రూప్‌ఫొటో.