తెలంగాణ

ఓరుగల్లు నుంచే టిఆర్‌ఎస్ పతనం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 13: రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఓరుగల్లు గడ్డనుండే పతనం ప్రారంభమవుతుందని టిడిపి శాసనసభపక్షనేత, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ అర్భన్ కలెక్టరేట్ ముందు నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాలతో రైతులు పూర్తిగా అప్పులఊబిలో కూరుకుపోతున్నా అందుకు సంబంధించిన విత్తనవ్యాపారులపై చర్యలు తీసుకునేది పోయి, ప్రశ్నించిన వ్యవసాయ కమిషనర్ ప్రియదర్శినిపై ప్రభుత్వం వేధింపుచర్యలకు పాల్పడి ఆమెను బలవంతంగా దీర్ఘకాలిక సెలవుపెట్టించి అమెరికా వెళ్లేవిధంగా చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాలు అమ్మేది సిఎం కెసిఆర్ బంధువులేనని ఆరోపించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలే వుండవన్న కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు జరిగాయని అన్నారు. సిఎం కెసిఆర్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానలవల్లే ఇప్పటివరకు 2600 రైతు ఆత్మహత్యలు జరిగాయని అన్నారు. కల్తి విత్తనాలను అరికట్టాలని మహాబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో రోడ్డెక్కిన రైతులపై ప్రభుత్వం అనేక రకాల కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోందని అన్నారు. కల్తీ విత్తన వ్యాపారులను గుర్తించి నకిలీ సీడ్స్ కంపెనీలను సీజ్ చేసినట్లైతే ఈ పరిస్ధితి వచ్చేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర ఏండ్లు కావస్తుందని, ఇప్పటి వరకు కెసిఆర్ ఇచ్చిన ఏఒక్క హామికూడ నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణ నకిలీ ఉద్యమకారులే నేడు మంత్రులుగా ఉన్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సమాజంలోని అన్ని వర్గాలను మోసగించి అధికారంలోకి వచ్చారన్నారు. ఇక దళితులకు మూడు ఎకరాల భూమి దిక్కు లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఏర్పటైన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కెసిఆర్ కుటుంబం తప్ప ఏ ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేదన్నారు. కొత్త జిల్లాల ప్రారంభోత్సవాలకు మంత్రులను పంపిన విధంగానే కల్తివిత్తనాలతో పంట నష్టపోయిన రైతులవద్దకు మంత్రులు, ఎమ్మెల్యేల బృందాలను పంపించాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ అధికార ప్రతినిధి ఇనగాల పెద్దిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రాష్ట్ర అధికార ప్రతినిధి నర్సిరెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య, వరంగల్ జిల్లా అద్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ ముందు జరిగిన టిడిపి రైతు ధర్నాలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి