ఆంధ్రప్రదేశ్‌

సంక్షేమానికి జిల్లా కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 14: పేదవాడికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల కనీస ఆదాయం లభించేలా చూడాలని ప్రభుత్వం సంకల్పించింది. సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఇకపై జిల్లా కమిటీలను నియమించి పర్యవేక్షించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలుతీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో శుక్రవారం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు. పేద, బలహీన వర్గాల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారికి భద్రత కల్పించాలని, ఇప్పటివరకు నీటి భద్రత, ఇంధన భద్రత, ఆహార భద్రత, ఆరోగ్య భద్రత కల్పించామని, ఇకపై ఆర్థిక భద్రతకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బ్రాహ్మణ, కాపు, మహిళా కార్పొరేషన్లకు సంబంధించిన అన్ని పథకాలను సమీకృతం చేసి ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలతో పాటు నెలకు రూ.10వేలు సంపాదించుకునేలా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించాలనే యోచనతో ఉన్నట్లు ఆయన వివరించారు. వ్యవసాయం, జలవనరులు, ఆరోగ్య శాఖల తరువాత ప్రభుత్వం సంక్షేమం, విద్యా రంగాలపై సంపూర్ణ దృష్టి సారించిందని, అన్ని సంక్షేమ శాఖల్లో అమలుచేస్తున్న పథకాల ప్రయోజనాలు ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికార యంత్రాంగం సమాయత్తం కావాలన్నారు. సంక్షేమం, సాధికారత కార్యక్రమాల పర్యవేక్షణకు ఇకపై జిల్లాస్థాయిలో ఉన్నత స్థాయి కమిటీలను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో కలెక్టర్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఆయా జిల్లాల మంత్రులు, జెడ్పీ చైర్మన్లు ముఖ్య సభ్యులుగా ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, కాపు, మహిళా కార్పొరేషన్ల చైర్మన్లు, ఎంపి, ఎమ్మెల్యేల్లో ఎవరెవరు కమిటీలో ఉండాలి, ఎవరెవరిని నామినేట్ చేయాలనే అంశాలపై వచ్చే సమావేశంలోగా ఓ స్పష్టతకు రావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కమిటీ సంక్షేమ పథకాల అమలుతీరును ప్రధానంగా పర్యవేక్షిస్తుంది. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని రుణ సహాయం, స్వయం ఉపాధి మార్గాలకు దోహదపడుతుంది.
డ్వాక్రా మహిళా సంఘాలను కూడా సంక్షేమంలో భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలైన ముద్ర, స్టార్టప్స్, స్టాండప్స్ వంటివాటిని సమ్మిళితం చేసి వారిని ఆర్థికంగా శక్తిమంతులను చేయాలని కోరారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌకధరల దుకాణాల్లో సైతం డ్వాక్రా ఉత్పత్తులు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్‌బాబు, కొల్లు రవీంద్ర, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.