తెలంగాణ

ముజ్రా పార్టీపై ఎస్‌ఓటి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, ఫిబ్రవరి 7: అక్రమార్జనతో జల్సాలకు అలవాటుపడ్డ జిహెచ్‌ఎంసి రెవెన్యూ సిబ్బంది సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు 24 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో పలువురు జిహెచ్‌ఎంసి ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది ఉద్యోగులను జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి సస్పెండ్ చేశారు. జిహెచ్‌ఎంసి వెస్ట్‌జోన్ పరిధిలోని సర్కిల్ 11, 12లో పనిచేసే టాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు హైటెక్ సిటీ పరిధిలోని ఖానామెట్‌లోని ఫాతిమా గెస్ట్‌హౌస్‌లో శనివారం రాత్రి ముజ్రా పార్టీకి సన్నాహాలు చేసుకున్నారు. పార్టీ అంటే సాదాసీదాగా చేసుకుంటే ఏం బాగుంటుంది, అని విందు, అశ్లీల నృత్యాలతో ఏర్పాటు చేసుకున్నారు. మద్యం తాగుతూ, అశ్లీల నృత్యంలో మునిగిపోయారు. ఈ పార్టీలో పాలుపంచుకున్నట్లు నటించిన ఓ జిహెచ్‌ఎంసి ఉద్యోగి పోలీసులకు సమాచారం అందించి తాను తప్పుకున్నాడు. విషయం సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులకు తెలియడంతో రాత్రి వెస్ట్‌జోన్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్ నేతృత్వంలో ఫాతిమా గెస్ట్‌హౌస్‌పై దాడిచేసారు. నిర్వాహకులతోపాటు ఆరుగురు యువతులు, ఎనిమిది మంది జిహెచ్‌ఎంసి ఉద్యోగులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణకు మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. వారివద్దనుంచి 21,150 నగదు, ఆరు వాహనాలు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
8మంది ఉద్యోగుల సస్పెన్షన్
నిన్న రాత్రి ముజ్రా పార్టీలో పాల్గొన్న ఎనిమిది మంది జిహెచ్‌ఎంసి ఉద్యోగులను కమిషనర్ జనార్దన్‌రెడ్డి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో టాక్స్ ఇన్‌స్పెక్టర్లు సంజయ్, పద్మభూషణ్‌రాజు, రవీంద్రుడు, బిల్ కలెక్టర్లు కృష్ణ, నరహరి, బాబురావు, జ్ఞానేశ్వర్, రణవీర్ భూపాల్ ఉన్నారు. మిగతా సిబ్బందిపై విచారణ జరిపి చట్టరీత్యా చర్య తీసుకుంటామని కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ పార్టీని బిల్ కలెక్టర్ నరహరి నిర్వహించారు.