ఆంధ్రప్రదేశ్‌

నిండు గోదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 15: దేశంలో ఏ నదికీ లేని విధంగా రెండు రుతు పవనాలు ఒక్క గోదావరి నదికే సొంతం. ఆవాసిత ప్రాంతం కూడా అత్యధికం. అందుకే ఇది జీవనది. గత 40 ఏళ్ళలో ఎపుడూ లేని విధంగా రికార్డుస్థాయిలో ఈ ఏడాది గోదావరి నదికి వరద సీజన్ పెరిగింది. ఆవాసిత ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద జలాల లభ్యత పెరిగింది. సాధారణంగా గోదావరి నదికి కేవలం మూడు నెలల కాలం పాటే వరద సీజన్‌గా వుంటుంది. ప్రతి సీజన్‌లోనూ జూలై నుంచి అక్టోబర్ వరకు వరద జలాల లభ్యత అధికంగా వుంటుంది. ఈ మాసాల్లో రెండు మూడు సార్లు మొదటి, రెండవ, మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి ప్రవాహ ఉద్ధృతి పెరుగుతుంటుంది. గోదావరి నదికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 11.75 అడుగుల నీటి మట్టానికి చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక, 13.75 అడుగులు నమోదైతే రెండో ప్రమాద హెచ్చరిక, 17.75 అడుగులు నమోదైతే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే ఈ సారి మాత్రం మే నెల నుంచి ప్రారంభమై వరదల సీజన్ ఇంకా కొనసాగుతూనే వుంది.
గోదావరి నది ఎగువ ఆవాసిత ప్రాంతంలో వర్షాలతో పాటు, స్థానిక ఆవాసిత ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల కారణంగా గోదావరిలో ఏప్రిల్ నెలాఖరు నుంచి ఎర్రనీరు ప్రవహిస్తోంది. దేశంలో ఏ నదికీ లేని విధంగా ఇటు ఈశాన్య రుతు పవనాలు, అటు నైరుతి రుతు పవనాలు గోదావరి నదికి కలసివచ్చాయి. దీంతో నీటి లభ్యత పెరిగింది. ఈ సీజన్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే భారీ వర్షాలు కురవడంతో గోదావరి నది ఉప నదులు కూడా పొంగిపొర్లాయి. దీంతో గోదావరి నదిలో అపారమైన నీటి లభ్యత లభించింది. ఉప నదులు శబరి, ప్రాణహిత ఈ సీజన్‌లో నిత్యం పొంగుతూనే వున్నాయి. దీనికి తోడు తూర్పు కనుమల్లోని వాగులు, వంకలు పెద్ద ఎత్తున వరద ఉద్ధృతితో గోదావరి నదిలో కలిశాయి. ఈ నేపథ్యంలో అఖండ గోదావరి నది వరద జలాలతో తొణికిసలాడుతోంది. నిత్యం లక్షలాది క్యూసెక్కుల వరద జలాలు సముద్రం పాలవుతున్నాయి. ఇప్పటి వరకు ధవళేశ్వరం బ్యారేజి నుంచి రికార్డు స్థాయిలో వరద జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఎపుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో గోదావరి జలాలు సముద్రంలోకి ప్రవహించాయని లెక్కకట్టారు. వరద జలాలు పుష్కలంగా వుండటంతో గోదావరి నది ఆవాసిత అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు నీటిని పుష్కలంగా సరఫరా చేశారు. ఇప్పటి వరకు 2943 టిఎంసిల జలాలు వృథాగా సముద్రం పాలయ్యాయి. రోజుకు సరాసరిగా బ్యారేజి నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి పోతున్నాయి. సత్వరం పోలవరం పూర్తి చేసి వరద జలాలను సాధ్యమైనంత వరకు వినియోగించుకునేందుకు పనులు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ద్వారా కేవలం 300 టిఎంసిలు మాత్రమే వినియోగించుకునే అవకాశం వుంది.
అయితే ఈలోగా పట్టిసీమ ద్వారా వినియోగించుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. ఇపుడు పోలవరం ఎడమ కాల్వను పూర్తి చేసి నిర్దేశిత ప్రాంతానికి నీళ్లను మళ్లించేందుకు దృష్టి కేంద్రీకరించారు. ఈలోగా పట్టిసీమ మాదిరిగానే పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల పధకాన్ని పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా వరద జలాలను వినియోగించుకునేందుకు ఈ పథకానికి ప్రభుత్వం తాజాగా జీ ఓ నెంబర్ 100ను 14వ తేదీనే విడుదల చేసింది.

రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద నిండుగా ప్రవహిస్తున్న గోదావరి