ఆంధ్రప్రదేశ్‌

వైసిపిలో అగౌరవం... అమర్యాద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, అక్టోబర్ 15: సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇకపై ఆ పార్టీలో తాను కొనసాగలేనని తేల్చి చెప్పారు. గత కొంత కాలంగా వేదవ్యాస్ అధినాయకత్వంపై తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోనన్ని అవమానాలు వైసిపి అధినేత జగన్ వల్ల ఎదుర్కొన్నానని వేదవ్యాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ మర్యాదలు లేని చోట ఉండలేనన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, అనుచరులతో ఆయన శనివారం స్థానిక దేవాంగ కళ్యాణ మంటపంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైకాపాలో తనకు ఎదురైన అవమానాలు, చిన్నచూపు తదితర అంశాలపై కార్యకర్తలతో మనసువిప్పి మాట్లాడారు. జగన్‌కు తన గురించి కొంతమంది పని గట్టుకుని చెప్పిన చాడీల వల్ల తనను నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి నుంచి తొలగించారన్నారు. టిడిపి, బిజెపిల నుంచి తనకు ఆహ్వానం అందినమాట వాస్తవమేనన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి, మెజార్టీ అభిమానులు, కార్యకర్తల అభీష్టం మేరకు తన నిర్ణయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.