తెలంగాణ

ఐదువేల కోట్లతో గ్రామీణ రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: ఏడాదిన్నర కాలంలో దాదాపు ఐదువేల కోట్ల రూపాయల వ్యయంతో 12వేల కిలో మీటర్ల రహదారుల నిర్మాణ పనులను పూర్తిచేయనున్నట్లు తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వీటిలో సగానికి పైగా పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గతంలో సమైక్య రాష్ట్రంలో 23 జిల్లాల పరిధిలోనూ ఏడాదికి వెయ్యి కోట్ల పనులు జరిగేవి కాదని చెప్పారు. జిల్లాల విభజన అనంతరం తొలిసారిగా ఎర్రమంజిల్‌లోని ఇఎన్‌సి కార్యాలయంలో జిల్లా ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, నాబార్డ్ నిధులతో చేపట్టిన రహదారులు, వంతెనల పనుల్లో తీవ్ర జాప్యం పై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం మార్చి 31 లోగా గత ఏడాది మంజూరైన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇకపై 45 రోజుల్లోనే రహదారుల అంచనాలు, సాంకేతిక అనుమతుల ప్రక్రియ అంతా పూర్తి చేయాలని, జాప్యం చేసే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. టెండర్లు దక్కించుకొని నెలల తరబడి పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని జూపల్లి ఆదేశించారు. తెలంగాణ వచ్చిన తరువాత నాణ్యతా ప్రమాణాలు మెరుగయ్యాయని ప్రజలు భావించేలా పనులు జరగాలని, నాణ్యత విషయంలో తేడా వస్తే సహించేది లేదని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఎక్కువ కాలం మనే్నలా నాణ్యతతో కూడిన రహదారులు, భవనాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ శాఖ అభ్యంతరాలతో కొన్ని పనులకు అంటకాలు ఏర్పడుతున్నాయని మంత్రి దృష్టికి ఇంజనీర్లు తీసుకు రాగా, దీనిపై అటవీ శాఖ మంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామని జూపల్లి తెలిపారు. కాగా, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా, సెర్ఫ్ సిఇఓగా నీతూప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.