ఆంధ్రప్రదేశ్‌

సిఎం కూడా పట్టించుకోవడం లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 19: అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది. నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏమాత్రం జరగడం లేదు. పార్టీ సమన్వయం అనేది లేనే లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య సయోధ్య దాదాపూ మృగ్యమైపోయింది. జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఎడ ముఖం..పెడ ముఖంగా ఉంటున్నారు. ప్రభుత్వ శాఖల సమీక్షలను ఏనాడో జిల్లా మంత్రులు పక్కన పెట్టేశారు. కనీసం వారి వారి సొంత శాఖలను కూడా జిల్లా మంత్రులు సమీక్షించడం లేదు. జిల్లా మంత్రులు ఎలాగూ తమను పట్టించుకోవడం లేదు. కనీసం ముఖ్యమంత్రైనా తమ గోడు వినిపించుకునే పరిస్థితి లేదటుంటున్నారు విశాఖ ఎమ్మెల్యేలు. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు వైఖరిపై నగర ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా వీరిలో గూడుకట్టుకుపోయిన అసంతృప్తి ఒక్కసారిగా బహిర్గతమైంది. అయితే, ఇప్పటి వరకూ జిల్లా మంత్రులపైనే అసహనంతో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిపైనే విమర్శలకు దిగుతున్నారు.
అసంతృప్తి రాజేసిన 3్ఫల్మ్‌నగర్ క్లబ్2
విశాఖలో వంద కోట్ల రూపాయలతో ఫిల్మ్‌నగర్ క్లబ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. సంవత్సరం కిందట సిఎం చంద్రబాబు ఈ క్లబ్‌కు శంకుస్థాపన చేశారు. ఫిల్మ్‌నగర్ క్లబ్‌కు కాపులుప్పాడలో స్థలాన్ని కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ, దాన్ని ఇప్పుడు బౌద్దారామాలు ఉన్న తొట్లకొండ మీదకు మార్చింది. బుద్దుని ఆనవాళ్లు ఉన్న చోట ఫిల్మ్‌నగర్ క్లబ్ ఎలా నిర్మిస్తారంటూ ఎమ్మెల్యేలే ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. స్థలాన్ని కేటాయించిన కలెక్టర్ వైఖరిని తప్పు పట్టారు. అంతేకాకుండా ఫిల్మ్‌నగర్ క్లబ్ శంకుస్థాపనకు తమను ఆహ్వానించలేదంటూ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ సమస్యను తెరమీదకు తీసుకువచ్చారు. ఇది ఎమ్మెల్యేలకు, మంత్రి గంటాకు మధ్య అగాధాన్ని సృష్టించింది. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా, మరికొంతమంది నగర ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులపై ఒంటికాలిపై లేచారు. విద్యా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న గంటా శ్రీనివాసరావు తన శాఖ సమీక్షను కూడా నిర్వహించడం లేదని, రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్షా అభియాన్ నిధులు ఏమవుతున్నాయో ఎమ్మెల్యేలకు కూడా తెలియడం లేదని అంటున్నారు. అలాగే జిల్లా పరిషత్‌లో ఏం జరుగుతోందో, నిధులేమైపోతున్నాయో మంత్రి అయ్యన్నపాత్రుడు సమీక్షించడం లేదని, ఇందుకు ఇటీవల జరిగిన జిల్లాపరిషత్ సమావేశంలో ఎమ్మెల్యేల అసంతృప్తే ఇందుకు నిదర్శనమని కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇదిలా ఉండగా సిఎం చంద్రబాబు వచ్చినప్పుడు తామంతా ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికి తిరిగి తమ తమ నియోజకవర్గాలకు వెళ్లిపోతున్నాం. ఆ తరువాత సిఎం వెంట కేవలం ఒక్క మంత్రి మాత్రమే ఉంటున్నారు. ఎమ్మెల్యేలెందుకు రావడం లేదని సిఎం ప్రశ్నించడం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులతో సమీక్షలు జరిపిపనప్పుడు కూడా సిఎం జిల్లా తమను అందులో భాగస్వాములను చేయడం లేదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న వ్యవహారాలను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కూడా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు చెపుతున్నారు. ఇక, జిల్లాలో అధికారులు తమ మాట వినడం లేదని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో, ఏం జరగబోతున్నాయో చెప్పే అధికారే లేరని అంటున్నారు. కొంతమంది జిల్లా ఉన్నతాధికారులు సిఎంతో నేరుగా సంబంధాలు కొనసాగించడం వలన తామను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు అంటున్నారు. అందుకే తాము గురువారం సిఎంను కలిసి సమస్యలను చెప్పుకోవాలనుకుంటున్నామని ఎమ్మెల్యేలు చెప్పారు.
అంతా కలిసే ఉన్నాం!
ఈ విషయమై మంత్రి గంటా శ్రీనివాసరావును వివరణ కోరగా ఎమ్మెల్యేలకు, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. ఫిల్మ్‌నగర్ క్లబ్‌ను తొట్లకొండపై ఇవ్వకూడదన్నది ఎమ్మెల్యేల అభిప్రాయం. ఆ విషయం పత్రికల ద్వారా చదివి తెలుసుకున్నాను. అవసరమైతే ఇచ్చిన స్థలాన్ని వెనక్కు తీసుకుంటామని గంటా చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడే అవకాశం ఉందని గంటా స్పష్టం చేశారు.