తెలంగాణ

పాఠ్యాంశాల్లో ఆధ్యాత్మికతను జోడించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, అక్టోబర్ 19: రోజురోజుకు పాశ్చాత్య విషసంస్కృతి పెరిగిపోతున్న నేటి యుగంలో దేశంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు కాకుండా ఉండేందుకు ఆధ్యాత్మికతను పాఠ్యాంశాల్లో జోడించాలని కంచి పీఠాధిపతి శ్రీ శంకర జయేంద్ర సరస్వతి స్వామీజీ అభిలషించారు. ధర్మప్రచార కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టిటిడి కళ్యాణ మండపంలో బుధవారం శ్రీ చంద్రవౌళీశ్వరస్వామి పూజ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. సమాజంలోని ప్రతిఒక్కరూ కుటుంబ బాధ్యతలు ఎరిగి కష్టపడి పనిచేస్తూ జీవించడంతో పాటు సత్పవర్తనతో కర్తవ్యాలను నిర్వర్తిస్తే కలియుగంలో ఆకలి లేకుండా చేయవచ్చునని ఉద్బోధించారు. నేటియుగంలో ధనాన్ని సంపాదించడమే ధ్యేయంగా అందరూ భావిస్తున్నారని, విద్య, ధనం సంపాదించడమే గొప్పకాదని, పుణ్యకర్మలు చేయకపోతే ఎంత ధనం, విజ్ఞానం ఉన్నా నిష్ప్రపయోజనమే అవుతుందన్నారు. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, సాటివారిపట్ల గౌరవంతో వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్కరూ హిందూధర్మ పరిరక్షణ కోసం కంకణబద్ధులు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ ఎ.రామయ్య తదితరులు పాల్గొన్నారు.
, కొప్పోలు యాదగిరిరావు, చకిలం రాజేశ్వరరావు, కట్టకోల పరిపూర్ణచారి, ప్రేమ్‌సాగర్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీర్వచనాలు పొందారు.

సూర్యాపేటలో టిటిడి కళ్యాణ మండపంలోకి విచ్చేస్తున్న కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి