తెలంగాణ

కొత్త సచివాలయానికి నేడు కేబినెట్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: కొత్త సచివాలయ నిర్మించే అంశాన్ని చర్చించడానికి మంత్రిమండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశం కానుంది. పాత భవనాన్ని కూల్చివేయడంతోపాటు ప్రస్తుతం దీంట్లో కొనసాగుతున్న కార్యాలయాలను తాత్కాలికంగా ఇతర భవనాలలోకి తరలించడం వంటి కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. కొత్త సచివాలయం నిర్మాణంపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొదట నిర్ణయించిన విధంగా రూ. 350 కోట్ల వ్యయంతో ‘యు’ ఆకారంలో నిర్మించాలనుకున్న ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. ఈ విషయాన్ని ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి ముఖ్యమంత్రి వివరించిన సంగతి కూడా తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించిన ఎ నుంచి డి బ్లాక్ వరకు భవనాలను కూల్చివేసి దాని స్థానంలోనే కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ముందు అనుకున్న డిజైన్ ప్రకారం కొత్త సచివాలయాన్ని నిర్మించాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలను కూడా తెలంగాణకు అప్పగించాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కార్యాలయాలు ఇక్కడ పది సంవత్సరాలపాటు కొనసాగేందుకు విభజన చట్టంలో అవకాశం కల్పించడంతో ఆ భవనాలను కూల్చివేసే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం విరమించుకుంది. దీంతో కొత్త సచివాలయాన్ని 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కాకుండా 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో పది అంతస్తులతో రూ. 180 కోట్ల వ్యయంతో నిర్మించాలని కెసిఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు పది అంతస్తులతో నిర్మించే భవనానికి శుక్రవారం జరుగనున్న మంత్రిమండలి ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. కొత్త సచివాలయ నిర్మాణంతోపాటు ప్రస్తుతం సచివాలయంలోని ముఖ్యమంత్రి, మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల కార్యాలయాలను ఎక్కడికి తరలించాలనే అంశంపై కూడా మంత్రిమండలి చర్చించనుంది. ప్రస్తుత సచివాలయంలోని కార్యాలయాలయసచివాలయం తరలింపుపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. బిఆర్‌కె భవన్, అరణ్య భవన్, గృహకల్ప, చంద్రవిహార్ తదితర భవనాలను రాజీవ్ శర్మ పరిశీలించి వాటిలోకి తాత్కాలికంగా ఏయే కార్యాలయాలను దానిపై నివేదిక సమర్పించారు. బిఆర్‌కె భవన్‌లోకి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలను, జలసౌధలోకి నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల మంత్రుల కార్యాలయాలను, డిజిపి కార్యాలయంలోకి హోంమంత్రి కార్యాలయాన్ని, అరణ్య భవన్‌లోకి అటవీశాఖ మంత్రి కార్యాలయాన్ని, ఇతర శాఖల మంత్రుల కార్యాలయాలను గృహకల్ప, చంద్ర విహార్ సముదాయంలోకి తరలించాలని రాజీవ్ శర్మ ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిసింది. దీనిపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
ఇలా ఉండగా కృష్ణా జలాల పంపిణిపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఈ అంశంపై తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించాలా? లేదా అనే అంశంపై కూడా మంత్రిమండలిలో ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది.