తెలంగాణ

వౌలిక సదుపాయాలపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను రూపొందించడంలో జిల్లాల కలెక్టర్లు నిమగ్నమయ్యారు. ప్రధానంగా కొత్త జిల్లాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, వౌలిక సదుపాయలు లేకపోయినా తన దృష్టికి తీసుకువస్తే, తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కలెక్టర్లకు తెలియచేశారు. జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందో కలెక్టర్ల నుండి సమాచారం తెప్పించాలని ముఖ్యమంత్రి ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను అదేశించారు. దాంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదిక పంపించాలని ఆయన ఆదేశించారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాలు, దళితులు, బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే గ్రామాల్లో పరిస్థితిపై అధ్యయనం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దాంతో కొత్తగా ఏర్పడ్డ జిల్లాల కలెక్టర్లు రంగంలోకి దిగారు. తొలుత ఆర్‌డిఓలతో చర్చించారు. అలాగే తహశీల్దార్లతో చర్చించారు. జిల్లాస్థాయి అధికారులతో కూడా చర్చించారు. వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు తమ తమ శాఖల్లో పరిస్థితిని పరిశీలించి వివరాలు అందచేయాలని ఆదేశించారు. దాంతో వివిధ శాఖల అధికారులు కూడా తమ తమ శాఖల పరిస్థితిపై నివేదికలను రూపొందిస్తున్నారు. కలెక్టర్లు కేవలం అధికార యంత్రాంగంపైనే ఆధారపడకుండా, స్వయంగా గ్రామాలకు, మారుమూల ప్రాంతాలకు వెళుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలతో వారు మమేకం అవుతున్నారు. ముఖ్యంగా యువతతో కలెక్టర్లు భేటీ అవుతున్నారు. యువతీ యువకులను పిలిచి వివరంగా మాట్లాడుతున్నారు. జిల్లాల విస్తీర్ణం తగ్గడంతో గ్రామాలకు వెళ్లేందుకు కలెక్టర్లకు సులువయింది. కలెక్టర్లు ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతానికి వెళ్లివస్తున్నారు. కలెక్టర్లు ముందుగా సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా గ్రామాలకు వెళుతుండటంతో వాస్తవ పరిస్థితి ఏమిటో వారికి అర్థమవుతోంది. గ్రామాల్లోని పాఠశాలలు, దవాఖానాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయితీ కార్యాలయాలు తదితర కార్యాలయాలను వీరు తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వ టీచర్లతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరవుతున్నారా లేదా అన్న అంశాలపై ప్రజల నుండి వివరాలు సేకరిస్తున్నారు.
దవాఖానాల్లో చికిత్స ఏ విధంగా జరుగుందో, మందులు అందుబాటులో ఉన్నాయా, డాక్టర్లు రోజూ వస్తున్నారా లేదా అన్న అంశాలపై పరిశీలిస్తున్నారు. ప్రధానంగా బిసి, ఎస్‌సి, ఎస్‌టి హాస్టళ్లను తనిఖీ చేస్తూ, వసతులు, భోజన సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తున్నారు. హాస్టళ్ల నిర్వహణ తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందుతుందా, మంచినీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, వార్డెన్లు సక్రమంగా విధులకు వస్తున్నారా అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం కొమరంభీం జిల్లా కలెక్టర్ ఎం. చంపాలాల్, భూపాల్‌పల్లి కలెక్టర్ ఎ. మురళి, నాగర్‌కర్నూలు కలెక్టర్ ఇ.శ్రీధర్ తదితరులంతా గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వచ్చారు. ఇతర జిల్లాల కలెక్టర్లు కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో పరిశీలించి నివేదికలను రూపొందించడంలో నిమగ్నమయ్యారు.