తెలంగాణ

ఫలితాలు మొదలయ్యాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమవుతుందని ప్రశ్నించిన వారికి ఇప్పుడు సమాధానం లభిస్తోందని, తెలంగాణ రాష్ట్ర అవతరణ ఫలితాలు మొదలయ్యాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే బుడిగ శోభ ఆధ్వర్యంలో కొందరు రైతులు మంత్రి రాజేందర్‌ను కలిసి ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. మిషన్ కాకతీయ విమర్శకుల నోళ్లకు తాళం వేసిందని అన్నారు. తెలంగాణ ఎందుకు? అని ప్రశ్నించిన వారికి జలకళతో కనిపిస్తున్న చెరువులే సమాధానం అని అన్నారు. తెలంగాణ వారికి పాలన చేతకాదు అని అప్పట్లో ఎద్దేవా చేశారని, కానీ ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు చూసి వారికి దిమ్మ తిరిగి పోతోందని అన్నారు. తెలంగాణలో ప్రతి అణువు తెలుసు కాబట్టి చెరువులే కాదు రోడ్ పక్కన ఉన్న కుంటలను కూడా నింపగలిగినట్టు చెప్పారు. దూరదృష్టితో రైతుల కష్టాలను శాశ్వతంగా పారద్రోలేందుకు చేపట్టిన మిషన్ కాకతీయ విజయవంతమైందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పికి 50 టిఎంసిల నీరు రానిదే కాలువలకు నీళ్లు వదలలేమని అధికారులు చెప్పారని రైతులు మంత్రికి తెలిపారు. అయితే అవన్నీ పాత రోజులని ప్రజల శ్రేయస్సే ముఖ్యం కాబట్టి నీళ్లు విడుదల చేయించామని మంత్రి రైతులకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తెలంగాణ ప్రజాప్రతినిధుల చేతిలోనే అధికారం ఉండడం వల్ల ఇది సాధ్యం అయిందని అన్నారు. నారాయణపూర్, రిజర్వాయర్ నుండి పైప్‌లైన్ ద్వారా గంగాధర, రామడుగు, చొప్పదండి, కొడిమెల మండలంలోని 12 చెరువులను నింపాలని రైతులు కోరారు.

చిత్రం..చొప్పదండి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మంత్రి ఈటలకు సమస్యలను వివరిస్తున్న రైతులు