తెలంగాణ

ఉపాధి హామీ బకాయిలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధిహామీ పథకం కింద కూలీల వేతన బకాయిలు పేరుకుపోయాయని, వెంటనే బకాయిలు చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి తెలంగాణ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం మహాజన పాదయాత్ర నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, యాచారం మండలాల్లోని పలు గ్రామాల్లో కూలీలకు నాలుగు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని వీరభద్రం పేర్కొన్నారు. ఏ గ్రామంలో చూసినా ఇదే పరిస్థితి ఉందని, ఉపాధిహామి పనులతోపాటు ఇంకుడు గుంతలు తీసుకున్న వారికి కూడా చెల్లింపుల జరగలేదని, ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో చేస్తున్న ప్రకటనలకు, గ్రామాల్లోని పరిస్థితులకు పొంతన లేకుండాపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్టమ్రంతటా పండగ వాతావరణం నెలకొందని ముఖ్యమంత్రి చెబుతున్న విధంగా ఈ రెండు మండలాల్లోని గ్రామాల్లో తమకు ఎక్కడా కనిపించలేదన్నారు. గ్రామాల్లో పనుల్లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఉపాధిహామీ పనులు చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించాలని, కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలని పార్టీ తరఫున ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు తమ్మినేని తెలిపారు.