తెలంగాణ

నిజాం షుగర్స్‌పై కనే్నసిన కెసిఆర్ కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్/బోధన్ రూరల్, అక్టోబర్ 20: నిజాం షుగర్స్ కర్మాగారం, ఆస్తులపై ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబం కనే్నసిందని, అందువల్లనే జాయింట్ వెంచర్‌లో నడుస్తున్న కర్మాగారాన్ని పూర్తిగా మూసివేశారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. తెరాస అధికారంలోకి వస్తే వంద రోజులలో నిజాం షుగర్స్‌కు పూర్వవైభవం తీసుకువస్తామని ఎన్నికల సభలలో వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్, ఎంపి కవిత, మంత్రి తారక రామారావులు నిజాం షుగర్స్‌ను ఏమి చేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గురువారం బోధన్ నిజాంచక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రలో భాగంగా మండలంలోని హున్స గ్రామానికి చేరుకుని రైతులతో కలిసి చెరకు పంటను పరిశీలించారు.
ఈ సందర్భంగా విక్రమార్క విలేఖరులతో మాట్లాడుతూ నిజాం షుగర్స్ విషయంలో గత పాలకుల కంటే తెరాస ప్రభుత్వం రైతులకు, కార్మికులకు అధికంగా అన్యాయం చేసిందని విమర్శించారు. కర్మాగారం పూర్తిగా మూతపడడం వలన కార్మిక కుటుంబాలు రోడ్డుపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నడుస్తున్న నిజాంచక్కెర కర్మాగారాన్ని ఎందుకు మూసివేశారో ముఖ్యమంత్రి ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణలోని ఇతర జిల్లాలలో ఎక్కడా కర్మాగారాలు మూతపడలేదని, కేవలం ఒక్క నిజాం షుగర్స్‌కు మాత్రమే ఈ దుస్థితి పట్టిందన్నారు. ఈ కర్మాగారం మూత వెనుక కొంతమంది వ్యక్తుల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. నిజాం షుగర్స్ కర్మాగారం కోసం చేపట్టిన మహాపాదయాత్ర ఆరంభం మాత్రమేనని, మూతపడిన ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ కార్మిక, కర్షక వర్గాల తరపున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. జిల్లా నుండి వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇక్కడి రైతాంగానికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాల వలన రైతులు పూర్తిగా నష్టపోవాల్సి వస్తోందని, దీనిని బట్టి తెరాస రైతాంగ సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు చేపడుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కి, సురేష్ షేట్కార్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ విప్ ఈరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..బోధన్ మండలం హున్స గ్రామంలో జరిగిన పాదయాత్రలో పాల్గొన్న
కాంగ్రెస్ నాయకులు విక్రమార్క, షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి