తెలంగాణ

జెట్ వేగంతో మిషన్ భగీరథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: మిషన్ భగీరథ పనులు జెట్ వేగంతో సాగుతున్నాయని భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరం అయిన ఎలక్ట్రో, మెకానికల్ యంత్రాలను బిహెచ్‌ఇఎల్ తయారు చేస్తోంది. ఈ సందర్భంగా బిహెచ్‌ఇఎల్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి బిహెచ్‌ఇఎల్ ద్వారా యంత్రాలు సమకూర్చుకోవాలని నిర్ణయించారని తెలిపారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు వేగంగా చేయాలని కోరారు.
గుజరాత్‌లో కొన్ని ప్రాంతాలకు వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీళ్లు అందించేందుకు 13 ఏళ్ల కాలం పట్టిందని, కానీ తాము మాత్రం మూడున్నర ఏళ్ల కాలంలో తెలంగాణలోని పల్లె పల్లెకూ మంచినీటిని అందించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్టు చెప్పారు. 26 సెగ్మెంట్లలోని దాదాపు 250 ప్రదేశాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చెప్పారు. సివిల్ వర్క్స్ మొదలైన తొమ్మిది నెలల్లోనే 10వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయని, దాదాపు ఆరువేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించినట్టు చెప్పారు. ఒక ప్రభుత్వ ప్రాజెక్టులో ఇంత వేగంగా పనులు జరగడం, బిల్లులు చెల్లించడం ఇంతకు ముందెన్నడూ జరగలేదని చెప్పారు. జెట్ వేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. అధికారులు, వర్క్ ఏజెన్సీలు సకాలంలో పనులు పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారని అన్నారు. బిహెచ్‌ఇఎల్ ప్రతినిధులు మిషన్ భగీరథ పనులు బాగున్నాయని తెలిపారు.
కొత్త రాష్ట్రం అయినా దేశానికి రోల్ మోడల్ లాంటి ప్రాజెక్టును తెలంగాణ చేపట్టిందని అభినందించారు. విద్యుత్, సాగునీరు, మంచినీరు, సంక్షేమ రంగాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలు ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. 227 పంపింగ్ స్టేషన్లలో 10 నుంచి 2900 హెచ్‌పి సామర్ధ్యం కల 1066 మోటార్లు కావాలని ఆర్‌డబ్ల్యుయస్ ఈఎన్‌సి సురేందర్‌రెడ్డి తెలిపారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి ప్రజలకు మంచినీటిని అందించాలని లక్ష్యం అని చెప్పారు. తమపై తెలంగాణ ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సకాలంలో మోటార్లు అందజేస్తామని చెప్పారు.

చిత్రం..బిహెచ్‌ఇఎల్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న
మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి