తెలంగాణ

సంపన్న జిల్లా.. పరిశ్రమల ఖిల్లా! సంగారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 19: రాష్ట్రంలో ఇటీవల నూతనంగా రూపుదిద్దుకున్న 31 జిల్లాల్లో సంగారెడ్డి జిల్లా ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు, భారతావనిలోని అతి పెద్ద విద్యాసంస్థలతో తులతూగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నాటి మెదక్ జిల్లాకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక జిల్లాగా గుర్తింపు కలిగివుంది. తాజాగా జిల్లాల విలీనంతో ఆ పేరును సంగారెడ్డి స్వంతం చేసుకుంది. తూర్పున కేంద్ర రంగానికి చెందిన పరిశ్రమలు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్ లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, పశ్చిమాన మహీంద్ర అండ్ మహీంద్ర, దక్షిణాన బ్రూవరీస్ పరిశ్రమలు, ఉత్తరాన బ్రూవరీస్, రసాయనిక పరిశ్రమలతో ఎల్లలను ఏర్పాటు చేసుకుంది. ఎంఆర్‌ఎఫ్, అరబిందో, పెన్నార్, ఆల్‌కబీర్, అల్లానా, ఏషియన్ పెయింట్స్, మెడిక్రాఫ్, కిర్బీ, ప్రాక్‌జేర్, పార్కర్, శాండివిక్, విజయ్ ఎలక్ట్రికల్స్ తదితర అనేక రసాయనిక పరిశ్రమలు విస్తరించాయి. వ్యవసాయ రంగానికే తలమానికమైన మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) కూడా సంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉండడం గర్వించదగ్గ ఆంశంగా పేర్కొనవచ్చు. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లో సుమారు 12 వేల ఎకరాల విస్తీర్ణంలో నిమ్జ్ పరిశ్రమలు రానుండడంతో జిల్లా మొత్తం పరిశ్రమలతో నిండుకుండలా మారనుంది. ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో తులతూగిన ఈ ప్రాంతం రానురాను పరిశ్రమలు విస్తరించడంతో భూముల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. వందలాది పరిశ్రమలు నెలకొల్పడంతో సంపన్న ప్రాంతంగా రూపుదిద్దుకుంది. లక్షలాది మందికి ఈ ప్రాంతం ఉపాధి కల్పిస్తూ అనేక కుటుంబాలకు జీవనాధారంగా మారింది. సంపన్న జిల్లాగా పేరు సంపాదించుకున్నా అంతకు పదిరెట్లు కాలుష్యంతో కలుషితమైంది.
జాతీయ రహదారుల ప్రక్కన ఉన్న భూముల ధరలు కోట్లు పలుకుతుండటంతో దేశవ్యాప్తంగా సంగారెడ్డి జిల్లా కీర్తినార్జించింది. సంగారెడ్డి జిల్లా భౌగోళికంగా, నైసర్గికంగా విశాలంగానే కొనసాగుతుంది. సాగు, తాగునీటి అవసరాల కోసం నిర్మించిన సింగూర్ ప్రాజెక్టు, మంజీర బ్యారేజ్‌లు కూడా సంగారెడ్డి జిల్లాకే దక్కడం విశేషం. కొత్తగా ఏర్పడిన మండల కేంద్రమైన కంది శివారులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటిహెచ్), పుల్కల్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామ శివారులోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జెఎన్‌టియు), కంది గ్రామ శివారులోని డివిఆర్ ఇంజనీరింగ్ కళాశాల, పసల్‌వాది గ్రామ శివారులోని ఎంఎన్‌ఆర్ మెడికల్ కళాశాల, పటన్‌చెరు మండలం రుద్రారం గ్రామ శివారులో గీతం డీమ్డ్ విశ్వ విద్యాలయంతో పాటు ఇతర విద్యా సంస్థలు అనేకంగా నెలకొల్పబడ్డాయి. సంగారెడ్డి జిల్లాలో మూడు మున్సిపల్ పట్టణాలు, ఒక నగర పంచాయతీ ఉండగా, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి.
సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్లతో మొత్తం 26 మండలాలుగా సంగారెడ్డి జిల్లా ఆవిర్భవించింది. గ్రేటర్ హైదరాబాద్ (జిహెచ్‌ఎంసి) పరిధిలోని పటన్‌చెరు, రామచంద్రాపూర్, భారతీనగర్ కార్పొరేట్ స్థానాలు సంగారెడ్డి జిల్లాలో కలిగి ఉండడంతో హైదరాబాద్‌ను భాగస్వామ్యం చేసుకుందని చెప్పవచ్చు. మొత్తంమీద రాష్ట్రంలో విస్తరించిన 31 జిల్లాల్లో సంగారెడ్డి జిల్లా ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకుని అందరి చూపును ఆకర్షిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.