తెలంగాణ

యువత చేతుల్లోనే దేశ పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, అక్టోబర్ 20: భారతదేశం శాస్త్ర సాంకేతికపరంగా అన్నిరంగాలలో పురోగతి సాధించాలంటే యువత నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లి గ్రామంలోని సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన మల్టీడిసిప్లినరీ లా కాన్ఫరెన్స్‌ను గవర్నర్ ప్రారంభించారు. అంతకుముందు యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ ఎస్‌బి ముజుందర్, వైస్ చాన్సలర్ డాక్టర్ రజినిగుప్తే గవర్నర్‌కు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ప్రజాస్వామానికి చట్టం పునాదిలాంటిదని, న్యాయబద్ధమైన విద్యకు ఈ సమాజంలో ఎక్కువగా ప్రాధాన్యత ఉందని అన్నారు. ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశం అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో యువత పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. విశ్వవిద్యాలయాలు విద్యార్థుల్లో నైతిక, సామాజిక విలువలతో కూడిన జాతీయ భావాలు పెంపొందించాలని అన్నారు. లా చదువుతున్న విద్యార్థులకు ఆ కళాశాలల యజమాన్యాలు ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని అందించేందుకు కృషి చేయాలని సూచించారు. విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు విద్యతోపాటు పర్యావరణ పరిక్షణపై విద్యార్థులకు వివరించాల్సిన బాధ్యత ఉందని సూచించారు. నేటి లా-విద్యార్థులు కేసులు సత్వర పరిష్కారానికి మార్గాలు వేయాలని అన్నారు.
విద్యార్థుల అవసరం సమాజానికి ఎంతో అవసరమని, ఆ దిశగా విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై పూర్తి స్థాయిలో శిక్షణ అందించేందుకు ప్రొఫెసర్లు కృషి చేయాలని అన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు స్వశక్తితో ఎదిగేందుకు తగిన ప్రోత్సాహాన్ని తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు అందించాలని సూచించారు. భారత రాజ్యాంగంలోని విశిష్టతలు, వౌలిక అంశాలను ప్రతిఒక్కరు గౌరవించాలని సూచించారు. దేశ భవిష్యత్‌కు విద్య అనేది ఒక ఆక్సిజన్ లాంటిదని, క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని అన్నారు. నేటి యువత చేతుల్లోనే భారతదేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, ఇందుకు విద్యార్థులు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని, లంచగొండితనాన్ని అణిచివేసే దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మానవత విలువలను ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయరాదని లా విద్యార్థులకు గవర్నర్ సూచించారు. ఈ సందర్భంగా లా కళాశాలకు సంబంధించిన నూతన పుస్తకాలను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింబాయసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎస్‌బి ముజుందర్‌తో పాటు వివిధ న్యాయ కళాశాలల ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

చిత్రం..రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లి గ్రామంలోని సింబియాసిస్ యూనివర్సిటీలో
గురువారం జరిగిన సదస్సులో ప్రసంగిస్తున్న గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్