తెలంగాణ

మూడు వారాల్లో అఫిడవిట్ సమర్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: నిజామాబాద్ జిల్లాలో ఉన్న నాగిరెడ్డిపేట మండలాన్ని కామారెడ్డి జిల్లాలో విలీనం చేయడంపై మూడువారాల్లోగా కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాగిరెడ్డిపేట మండలానికి చెందిన జగ్గి జయరాజు మరో 9 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్ విచారించారు. పిటిషనర్ల తరఫున బి రచన అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్ర్తియంగా జరిగిందన్నారు. నాగిరెడ్డిపేట నిజామాబాద్‌కు 110 కి.మీ దూరంలో ఉందని, గతంలో ఈ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలని ఆమెకోరారు. తమ మండలాన్ని మెదక్ జిల్లాలో విలీనం చేయాలని ఈ మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరారన్నారు. మెదక్ పట్టణం నుంచి ఈ మండలం 16 కి.మీ దూరంలో ఉందన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని మెదక్ పట్టణంలో ఈ మండలం యువకులు ఉద్యోగం చేయాలనుకుంటే ఎవరైనా నిరోధిస్తారా, చదవాలనుకుంటే అభ్యంతరాలు వస్తాయా అని అడిగారు.
న్యాయవాది రచన వాదనలు వినిపిస్తూ ఈ మండలానికి చెందిన రాజు అనే యువకుడు ప్రభుత్వ చర్యకు నిరసనగా ట్యాంక్ బండ్‌పై పెట్రోలుపోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణా రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ మండలం గతంలో కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో ఉండేదని, ఇప్పుడు ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తెచ్చామన్నారు. ఈ అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజిని హైకోర్టు ఆదేశించారు.