తెలంగాణ

అంకుర సంస్థలకు ప్రోత్సాహం అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ - అస్సాం రాష్ట్రాల మధ్య వివిధ అంశాలపై త్వరలోనే పలు ఒప్పందాలు జరుపుకోనున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. అస్సాం రాష్ట్ర అటవీ, ఐటి, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాటర్ రిసోర్సెస్ మంత్రి కేశభ్ మహంత వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు మహంత నేతృత్వంలో ఒక బృందం శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో మహంత సమావేశం అయ్యారు. ఈ బృందం టి-హబ్‌ను సందర్శించింది. అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్న తీరు అద్భుతంగా ఉందని చెప్పారు. మహంత బృందం మంత్రి జోగురామన్నను కలిసింది. విద్య, ఐటి, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా పలు అంశాల్లో ఇరు రాష్ట్రాల మధ్య త్వరలోనే ఎంఓయు కుదురుతుందని మంత్రి తెలిపారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరిత హారం, ఐటి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని అస్సాం మంత్రి మహంత తెలిపారు.
అస్సాం రాష్ట్రానికి చెందిన సుమారు రెండు లక్షల మంది తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారని మహంత తెలిపారు.