తెలంగాణ

నీచ రాజకీయాల ఘనత కాంగ్రెస్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, అక్టోబర్ 21: దేశ రాజకీయాలను నీచస్థాయికి తీసుకువెళ్లిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత విమర్శించారు. తొమ్మిది దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలను విజయవంతంగా పూర్తిచేసుకొని నగరానికి వచ్చిన సందర్భంగా శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై ఈవిధంగా స్పందించారు.
ఎంతో శ్రమించి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు అణచివేతకు గురయ్యాయని అన్నారు. దేశ ప్రధానిగా, బహుభాషా కోవిదునిగా పేరున్న పివి నర్సింహారావుకు సైతం ఈ గడ్డపై తగిన ప్రాధాన్యత దక్కలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత సంస్కృతి పరిరక్షణలో భాగంగా దేశ, విదేశాల్లో బతుకమ్మ ప్రాధాన్యత తెలిపేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వివరించారు.
ఏ ఇతర దేశ సంప్రదాయాలకు విలువనివ్వని కువైట్ వంటి దేశంలో కూడా ప్రాణాలకు తెగించి అక్కడి ప్రజలు బతుకమ్మ ఉత్సవాలు జరపడం నిజంగా మరిచిపోలేని క్షణాలని అన్నారు. ఆస్తుల వెల్లడిపై ప్రశ్నించగా చంద్రబాబులా తాము అడ్డగోలుగా సంపాదించ లేదని, నిబద్ధతతో పన్నులు చెల్లిస్తున్న తాము ఆదాయపన్ను అధికారులకు మాత్రమే చూపిస్తామన్నారు. మాంసం తిన్నామని బొక్కలు మెడలో వేసుకోము అంటూ కవిత చమత్కరించారు. జిల్లాల విభజనపై నారా లోకేష్ విమర్శలపై స్పందిస్తూ తెలంగాణను వ్యతిరేకించిన లోకేష్ జిల్లాల విభజనను వ్యతిరేకించడం సాధారణమైన విషయమేనని అన్నారు. పక్క రాష్ట్ర విషయాలపై కాకుండా ఏపిలో పాలనపై దృష్టి పెట్టాలంటూ లోకేష్‌కు సూచించారు.

తెలంగాణను వ్యతిరేకించిన సిపిఎం 99శాతం ప్రజలు సంతృప్తిగా లేరని మాట్లడటం ర్యాలీలు, దీక్షలు చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. అలాంటి పార్టీలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పారు. దసరా సందర్భంగా తాను శుభాకాంక్షలు తెలిపితే దానిని సైతం రాజకీయం చేయడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని, గత ప్రభుత్వాలు చేసినట్టుగా కాకుండా నిబద్ధతతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సుముచిత స్థానం దక్కుతుందని, పార్లమెంట్‌లో మహిళాబిల్లు పెడితే తమ పార్టీ తరఫున పూర్తి మద్దత్తునిస్తామని కేసిఆర్ ఏనాడో ప్రకటించారని చెప్పారు. ఈ సమావేశంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజవౌళి చారి, సెక్రెటరీ విజయ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.