తెలంగాణ

బ్రాహ్మణ సంక్షేమంపై నేడు మాటామంతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేతృత్వంలో ఆదివారం ‘మాటామంతీ’ (ఇంటరాక్టివ్ సెషన్) నిర్వహిస్తున్నారు. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి)లో ఏర్పాటు చేసే ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి, విద్యాసాగర్‌రావు, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొంటున్నారు. తెలంగాణ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు భానుమూర్తి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర శర్మ, సంఘం నాయకులు అంబప్రసాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.
తెలంగాణలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం 2016-17 వార్షిక బడ్జెట్‌లో రూ.100 కోట్లు పొందుపరిచారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వార్షిక బడ్జెట్‌ను శాసనసభకు గత మార్చిలో సమర్పిస్తూ, రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో చాలామంది బ్రాహ్మణులు పేదరికంతో సతమతం అవుతున్నారని, పిల్లలను చదివించలేని దుస్థితిలో ఉన్నారని పేర్కొన్న విషయం గమనార్హం. అందుకే 100 కోట్ల రూపాయలను ‘బ్రాహ్మణ సంక్షేమ నిధి’కి అందచేస్తామని ప్రకటించారు. సమాజంలో ఇతర కులాలకు చెందిన పేదలకు ఏ విధంగా ఆర్థికంగా ప్రభుత్వం చేయూత ఇస్తుందో, అదే విధంగా బ్రాహ్మణుల్లో పేదలకు చేయూత ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఉద్దేశమని ప్రకటించారు. 2016-17 సంవత్సరంలో కనీసం 50 వేల మందికైనా చేయూత ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అప్పట్లో ప్రకటించారు.
ఈ నేపథ్యంలో బ్రాహ్మణ సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి స్వయంగా మాటామంతీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ‘రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంస్థ’ను ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును చైర్మన్‌గా నియమించింది. 2016-17 సంవత్సరానికి ఏపి ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమం కోసం రూ.65 కోట్లు కేటాయించింది. గత ఏడాది కంటే ఇది దాదాపు 87 శాతం ఎక్కువని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసే అంశంపై కూడా ఆదివారం జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలిసింది.