తెలంగాణ

అధికార పార్టీలో అంతర్గత సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: అధికార పార్టీలో అంతర్గత సంక్షోభం ఆరంభమైందని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. అందుకే బోగస్ సర్వేలు చేయించుకుంటున్నారని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. తప్పుడు ప్రచారంలో గోబెల్స్‌ను మించిపోయేలా ఉన్నారని ఆయన ముఖ్యమంత్రిని ఉద్ధేశించి అన్నారు. ముఖ్యమంత్రికి సర్వేపై విశ్వాసం ఉంటే వివిధ పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన 25 మంది ఎమ్మెల్యేలతో, ముగ్గురు ఎంపీలతో రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. అనర్హత వేటు పడకుండా కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. రుణమాఫీ చేయకున్నా రైతులు ఎలా సంతోషంగా ఉంటారని ఆయన ప్రశ్నించారు. రెండు పడకల గదుల ఇళ్ళ నిర్మాణం ఏమైందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నిర్ణయాలు, మాటలు పిచ్చి తుగ్లక్‌ను గుర్తు తెస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారని ఆయన తెలిపారు.