తెలంగాణ

ఆరోగ్య శ్రీపై మంత్రి చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య కార్డులపై ఎలాంటి ప్రయోజనాలు కల్పించాలన్న అంశంపై వైద్యమంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి శనివారం సచివాలయంలో సంబంధిత అధికారులతో చర్చించారు. ఆరోగ్య కార్డుల చెల్లుబాటు, వైద్య పరీక్షలు, శస్తచ్రికిత్సలు, ఆ యా విభాగాల వారీగా ఆసుపత్రులకు ఏ విధంగా నిధులు చెల్లించాలి అన్న అంశంపై చర్చించారు. ప్యాకేజీ ఇవ్వడమా? పరీక్షల వారీగా చెల్లించడమా? అన్న అంశంపై కూడా చర్చించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా పథకాలు ఏ విధంగా అమలుతున్నాయో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 25 న మరోపర్యాయం సమావేశమై చర్చించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఇహెచ్‌ఎస్/జెహెచ్‌ఎస్ సిఇఓ డాక్టర్ కె. పద్మ, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.