తెలంగాణ

కొత్త జిల్లాలకు కృషి విజ్ఞాన కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,అక్టోబరు 23: ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు చూపుతో ఏర్పడ్డ కొత్త జిల్లాల వలన కలిగే లాభాల పరంపర మొదలైందని తెరాస ఎంపి వినోద్‌కుమార్ అన్నారు. నూతనంగా ఏర్పడ్డ జిల్లాలలో జిల్లాకొకటి చొప్పున కృషి విజ్ఞాన కేంద్రాలు మంజూరు జరగనున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 20న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ దేశంలో ప్రతీ జిల్లాకు ఒకటి చొప్పున కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారని ఆయన చెప్పారు. ఈ ప్రకటన వల్ల ప్రస్తుతం తెలంగాణలో 13 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉండగా, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలలో 16 నూతన కేంద్రాలు రానున్నాయని ఆ ప్రకటనలో వెల్లడించారు. మల్కాజ్‌గిరి, హైదరాబాద్ పూర్తిగా అర్బన్ జిల్లాలైనందున వాటికి మినహాయిస్తూ ఇతర జిల్లాలన్నింటిలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు.