తెలంగాణ

ఎలుగుబంటి దాడిలో కూలీకి తీవ్రగాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, అక్టోబర్ 23: జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ మండలం తుర్తి గ్రామానికి చెందిన మట్కం గంగారాం అనే వ్యక్తిపై ఆదివారం ఎలుగుబంటి దాడి చేసింది. ఈ సంఘటనలో గంగారం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అసుపత్రికి తరలించగా ప్రాణపాయస్థితి నుండి బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడిన గంగారంను మొదట కోరుట్ల ప్రభుత్వ అసుపత్రిలో ప్రాథమిక వైద్యం అందించగా, అతని పరిస్థితి విషమంగా ఉండడంతో జగిత్యాల జిల్లా కేంద్ర అసుపత్రికి తరలించారు. కథలాపూర్ మండలం తుర్తి గ్రామానికి చెందిన ముదిరాజ్ కులానికి చెందిన మట్కం గంగారాం వరసకు సోదరుడైన పీసరి లక్ష్మనారాయణతో కలిసి రోజువారి ఉపాధి కోసం సమీపంలోని ఆటవీ ప్రాంతానికి సీతాఫలాల సేకరణకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆటవీ ప్రాంతంలో సీతఫలాలను సేకరిస్తుండగా, దాదాపు 12:30 గంటల సమయంలో చెట్ల పొదల్లో ఉన్న ఎలుగుబంట్లు ఒక్కసారిగా గంగారాంపై దాడి చేసాయి. దీంతో అతను కేకలు వేయడంతో సమీపంలో ఉన్న లక్ష్మినర్సయ్య అక్కడుకు చేరుకుని సమయస్ఫూర్తితో వ్యవహరించి వాటిని తరమివేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మినర్సయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకుని కుటుంబ సభ్యులు గంగారాంను అసుప్రతికి తరలించగా, అసుపత్రి వైద్యుల సూచన మేరకు జిల్లా కేంద్ర అసుపత్రి తరలించారు. ప్రస్తుతం గంగారాం జగిత్యాలలో ఇక్కడ చికిత్స పొందుతున్నాడు.

చిత్రం.. బాధితుడు గంగారాం