తెలంగాణ

రైతు దీక్ష పేరుతో రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి/రామడుగు, అక్టోబర్ 23: ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిక్కచ్చిగా అమలు చేస్తుంటే, ఉద్యమం పేరిట టిజెఎసి చైర్మన్ కోదండరాం కాంగ్రెస్, టిడిపిలకు తొత్తుగా మారి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పేరిట కాలయాపన చేసింది ఎవరో ప్రజలకు తెలుసని, వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియాజకవర్గంలోని రామడుగు మండలం గోపాల్‌రావుపేటలో ఆదివారం జరిగిన రైతు సదస్సులో మంత్రి హరీష్‌రావుతో పాటు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మంత్రి హరీష్ మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరిట కాంట్రాక్టులు దక్కించుకొని నామమాత్రంగా వ్యవహరించి కోట్లాది రూపాయలను దండుకొన్న కాంగ్రెస్, టిడిపిల సంగతి ప్రజలకు తెలుసని, కానీ కోదండరాంకు తెలియదని, అదే పనిగా వారికి అమ్ముడు పోయి తొత్తుగా మారారని, ఇది మంచి పరిణామం కాదన్నారు. తాము చెప్పిన మాట ప్రకారం అన్నింటినీ ప్రణాళిక ప్రకారం అమలుచేస్తున్నామన్నారు. నేడు మిషన్ కాకతీయతో చెరువులను పుణరుద్ధరించామని, ఆ విషయం ప్రపంచమే గుర్తించందని, కానీ కావాలని రాజకీయ లబ్ధికోసం రైతు ఉద్యమాల పేరిట ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. రైతులకు 9 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పడమే కాదు ఇచ్చి తీరుతున్న ఘనత కెసిఆర్‌దేనని తెలిపారు. తాము రైతన్నల కోసం ముందు చూపుగా వ్యవహరించడం వల్లే నేడు చెరువులు పూర్తిగా నిండుకుని రైతులకు బాసటగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే బొడిగ శోభ, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, ఎంపిపిలు గుర్రం భూంరెడ్డి, వీర్ల కవిత, జడ్‌పిటిసిలు ఇప్పనపల్లి సాంబయ్య, మార్కెట్ చైర్మన్ పూడూరి మణెమ్మ, మాజీ ఎంపిపి వెల్మ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సదస్సులో ప్రసంగిస్తున్న మంత్రి హరీశ్‌రావు