తెలంగాణ

నిజాం షుగర్స్‌ని కాపాడుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, అక్టోబర్ 23: రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచైనా నిజాం సుగర్స్ కర్మాగారాలను కాపాడతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. చక్కెర కర్మాగారాల విషయంలో ప్రభుత్వం దిగి వచ్చే వరకు కార్మిక, కర్షక వర్గాల తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందన్నారు. ఆసియా ఖండంలోనే పేరుగాంచిన నిజాం చక్కెర కర్మాగారాలను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా రాబోయే శాసనసభా సమావేశాలలో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న నిజాం చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర ఆదివారం నాటితో ముగిసింది. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిజాం సుగర్స్ కర్మాగారాన్ని తెరాస ప్రచారాస్త్రంగా మార్చుకుందని విమర్శించారు. తాము అధికారంలోనికి వస్తే వంద రోజులలో నిజాం చక్కెర కర్మాగారానికి పూర్వవైభవం తీసుకువస్తామని వాగ్ధానం చేసిన ముఖ్యమంత్రి నేడు ఈ కర్మాగారాన్ని పూర్తిగా మూసివేసి కార్మిక, కర్షక వర్గాలకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. 30 దేశాలలో పేరుగాంచిన ఈ కర్మాగారాలను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మూసివేయడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని, కార్మిక, కర్షక వర్గాలు అభివృద్ధి చెందవచ్చని కలలు గన్నారని, కానీ కెసీఆర్ సర్కార్ వాగ్ధానాలను తుంగలో తొక్కుతూ అన్ని వర్గాల వారిని నిలువునా మోసం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అధికారంలోనికి రాకముందు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసీఆర్ అధికారంలోనికి రాగానే ఈ రుణమాఫీని నాలుగు దఫాలుగా చేస్తామని చెప్పి రైతులను అప్పులపాలు చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది రైతులు ఉన్నారని, వీరికి ఆరువేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. ఈ రుణాలకు డబ్బులు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి వాటర్‌గ్రిడ్‌కు వేలాది కోట్ల రూపాయలు ఎల్లా చెల్లిస్తున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు. విద్యార్థులు ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించకుండా ముఖ్యమంత్రి తన విలాసవంత జీవితం కోసం 30 కోట్ల రూపాయలు వెచ్చించి నివాసాన్ని నిర్మించుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు. 14 లక్షల మంది పేద విద్యార్థులు ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని, తక్షణమే ఈ నిధులను విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు సమస్యలతో సతమతమవుతుంటే ముఖ్యమంత్రి కెసీఆర్ ఫాంహౌస్‌లో ఉంటూ కాలం వెళ్లదీస్తుండగా నిజామాబాద్ ఎంపి కవిత బతుకమ్మ పేరుతో విదేశాలు తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిజాంసుగర్స్ సంస్థలను స్వాధీనం చేసుకోవడంతో పాటు రైతులకు ఏకకాలంలో రుణామాఫీ చేయాలని, పేరుకుపోయిన ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను, మధ్యాహ్న భోజన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో సిఎల్పీ నేత జానారెడ్డి, మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ ఎంపి మధుయాష్కి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, కాంగ్రెస్ నాయకులు జీవన్‌రెడ్డి, ఈరవత్రి అనిల్, జగ్గారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, మహేష్‌కుమార్ గౌడ్, గడుగు గంగాధర్, అరుణతార పాల్గొన్నారు.

చిత్రం.. బోధన్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి