తెలంగాణ

వారసత్వ ఉద్యోగాలపై ఉత్తర్వులేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, అక్టోబర్ 23: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీకి సంబంధించి ప్రభుత్వం నుండి ఇంకా సర్క్యులర్ విడుదల కాకపోవడంతో కార్మిక వర్గంలో ఆందోళన నెలకొంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలాంటి షరతులు లేకుండా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీనితో సింగరేణి విస్తరించి ఉన్న అన్ని జిల్లాలలో కార్మికులు సంబురాలు చేసుకున్నారు. పలుచోట్ల సిఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు కూడా చేశారు. ఆయితే ఇప్పటివరకు వారసత్వ ఉద్యోగాలపై ఎలాంటి సర్క్యులర్ విడుదల కాకపోవడంతో కార్మికులలో ఆందోళన ప్రారంభమైంది.
సింగరేణి సంస్థ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నతరుణంలో 1998వ సంవత్సరంలో వారసత్వ ఉద్యోగాలను యాజమాన్యం నిలిపివేసింది. 1998 జూన్ 6వ తేదీన సింగరేణి యాజమాన్యం, జాతీయకార్మిక సంఘాల మధ్య ఒప్పందం కూడా జరిగింది. దీని ప్రకారం భవిష్యత్తులో సంస్థ ఆర్థికపరిస్థితి బాగుపడి ఖాళీలు ఏర్పడితే తిరిగి వారసత్వపు ఉద్యోగాలను ఇవ్వాలనే నిర్ణయంతో ఒప్పందం కుదిరింది.
అదేసంవత్సరం వలంటరీ రిటైర్‌మెంట్ (విఆర్‌ఎస్) పథకం కింద 3006 మంది కార్మికులు విఆర్‌ఎస్ పెట్టుకుని సింగరేణి యాజమాన్యం ప్రకటించిన రూ 2లక్షలు తీసుకున్నారు. అయితే 103మంది కార్మికులు ఈ డబ్బులను తీసుకోకుండా వారసత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీప్రకారం వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి సర్క్యులర్ విడుదలకాక కార్మికులు ఆందోళన చెందుతుంటే, 1998లో విఆర్‌ఎస్ పెట్టుకుని రూ 2లక్షలు తీసుకున్నవారు తమకుకూడా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఉద్యమాలను చేపట్టారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన వారసత్వ ఉద్యోగాల హామీపై పూర్తినియమనిబంధనలతో సర్క్యులర్ విడుదల చేస్తే వారసత్వ ఉద్యోగాలపై నెలకొన్న సందిగ్ధత వీడే అవకాశముంది. ప్రభుత్వం సత్వరమే వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి సర్క్యులర్ విడుదలచేసి సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆమోదించి రీజినల్ లేబర్ కమిషనర్ సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సింగరేణి కార్మికులను సరిహద్దులోని సైనికులతో పోల్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కార్మికసంఘాలు కోరుతున్నాయి.