తెలంగాణ

తెలంగాణ యువ దర్శకుడికి అంతర్జాతీయ టూరిజం అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ ఫిల్మ్ డైరెక్టర్ దూలం సత్యనారాయణ నిర్మించిన పర్యాటక చిత్రానికి అంతర్జాతీయంగా ప్రతిష్ఠాకరమైన అవార్డు లభించింది. ఈ నెల 19 నుంచి 21వ తేదీల వరకు పోర్చుగల్‌లో అంతర్జాతీయ పర్యాటక ఉత్సవం జరిగింది. ఉత్తమ టూరిజం చిత్రాల నిర్మాణానికి అవసరమైన ఫిల్మ్ లోకేషన్స్‌పై మూడు నిమిషాల నిడివి ఉన్న చిత్రాన్ని దూలం సత్యనారాయణ నిర్మించారు. ఈ ఉత్సవంలో 52 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. 302 చిత్రాలు ఎంట్రీలుగా వచ్చాయి. ఈ ఉత్సవ అవార్డులను ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్స్ (సిఐఎఫ్‌ఎఫ్‌టి) గుర్తించింది. తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ నిర్మించిన ఈ చిత్రానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం పట్ల దూలం సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అంతర్జాతీయంగా చిత్రాల నిర్మాణానికి గమ్యస్థానంగా మారేందుకు ఉన్న అవకాశాలపై దూలం సత్యనారాయణ చిత్రాన్ని నిర్మించారు. ఈ అవార్డును ఈ నెల 21న పోర్చుగల్‌లో జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ అందుకున్నారు. భారతదేశం నుంచి ఎంపికైన ఒకే చిత్రం తెలంగాణ పర్యాటక రంగానికి చెందినది కావడం విశేషం.