రాష్ట్రీయం

ఉద్యోగ భద్రత, జీతాల పెంపునకు హోంగార్డుల దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: ఉద్యోగ భద్రతతోపాటు జీతాలు పెంచాలని కోరుతూ హోంగార్డుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఆదివారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అంబర్‌పేటలో చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు సుమారు ఐదువందల మంది హోంగార్డులు హాజరయ్యారు. పనిగంటలతో సంబంధం లేకుండా సివిల్ పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు తగిన వేతనం లభించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సెలవులకు నోచుకోకుండా 24గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న హోంగార్డుల శ్రమకు తగిన జీతభత్యాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా తమకు వేతనాలు చెల్లించాలని కోరారు. ప్రస్తుతం చెల్లించే వేతనాలతో తమ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని హోంగార్డుల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ పోలీసులతో పోలీస్తే తమ వేతనాలు పది రెట్లు తక్కువగా ఉన్నాయని, మానవతా దృక్పథంతో జీతభత్యాల పెంపునకు ప్రభుత్వానికి తగు ప్రతిపాదనలు పంపాలని వారు పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత, జీతాల పెంపుపై హామీ ఇచ్చే వరకూ తమ నిరవధిక నిరాహారదీక్ష కొనసాగుతుందని హోంగార్డుల సంఘం హెచ్చరించింది. అయితే విధులకు హాజరవుతూనే తమ నిరశన కొనసాగుతుందని హోంగార్డులు స్పష్టం చేశారు.
హోంగార్డులు చేపట్టిన దీక్షా శిబిరం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు దీక్ష శిబిరం వద్ద నుంచి వెళ్లిపోవాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హోంగార్డుల సంఘం అధ్యక్షుడు నారాయణ హెచ్చరించారు.