తెలంగాణ

తొలి గ్రీవెన్స్‌డేలో వినతుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, అక్టోబర్ 24: జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి గ్రీవెన్స్‌డేను సోమవారం స్థానిక ఆర్డీవో సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు నేతృత్వంలో నిర్వహించారు. ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. ప్రధానంగా భూసమస్యలు, ప్రభుత్వం తరపున విడుదల కావాల్సిన నిధులపై ఎక్కువ మంది దరఖాస్తులు అందజేశారు. అన్ని దరఖాస్తులను పరిశీలించి త్వరలో పరిష్కారమయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. దరఖాస్తులపై సంబంధిత శాఖాధికారులు సత్వరమే స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాంకిషన్, తదితర ఉన్నతాధికారులు గ్రీవెన్స్‌డేలో పాల్గొన్నారు.