తెలంగాణ

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, అక్టోబర్ 24: సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం కాంట్రాక్ట్ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. కోల్‌బెల్ట్ విస్తరించి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుండి భారీ సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది భారీగా మోహరించారు. సింగరేణిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను ఇచ్చిన హామీ ప్రకారం పర్మినెంట్ చేయాలని, జెబిసిసిఐలో జరిగిన ఒప్పందం ప్రకారం హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని, ఎనిమిది గంటల పనివిధానం, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, లాభాల బోనస్‌ను కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వర్తింపచేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం సింగరేణి ప్రధాన కార్యాలయంలో జనరల్ మేనేజర్ బసవయ్యకు వినతిపత్రం అందజేశారు.