తెలంగాణ

హోంగార్డులకు కోదండరాం అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: హోంగార్డులకు ఉద్యోగ భద్రతతోపాటు వేతనాలు పెంచాలని కోరుతూ అఖిల భారత హోంగార్డుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సకినాల నారాయణ చేపట్టిన ఆమరణ దీక్షకు తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం మద్దతు ప్రకటించారు. హైదరాబాద్‌లో సోమవారం నారాయణ చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. హోంగార్డుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, కానిస్టేబుళ్లతోపాటు హోంగార్డుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు వంటి వారి కోర్కెలు న్యాయబద్ధమైనవేనన్నారు. ప్రభుత్వం వెంటనే హో0గార్డుల డిమాండ్లను సానుకూలంగా స్పందించి తగు న్యాయం చేయాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. హోంగార్డుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ, సివిల్ పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు తగిన వేతనం లభించడం లేదన్నారు. ఎలాంటి సెలవులకు నోచుకోకుండా 24గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న హోంగార్డుల శ్రమకు తగిన జీత భత్యాలు చెల్లించకపోవడం విచారకరమన్నారు. సివిల్ పోలీసులతో పోలిస్తే తమ వేతనాలు పది రెట్లు తక్కువగా ఉన్నాయని, మానవతా దృక్పథంతో జీత భత్యాల పెంపునకు ప్రభుత్వానికి తగు ప్రతిపాదనలు పంపాలని పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత, జీతాల పెంపుపై హామీ ఇచ్చే వరకూ తమ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని హోంగార్డుల సంఘం అధ్యక్షుడు నారాయణ హెచ్చరించారు.