తెలంగాణ

‘గల్ఫ్ బాధితులను ఆదుకోవాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: గల్ఫ్‌లోని భారత కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ జాగృతి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరింది. మూడు రోజుల అధికారిక పర్యటన కోసం బహ్రెయన్‌కు వచ్చిన రాజ్‌నాథ్‌సింగ్‌ను తెలంగాణ జాగృతి బహ్రెయన్ శాఖ అధ్యక్షుడు చెల్లంశెట్టి హరిప్రసాద్ ఇతర కార్గవర్గ సభ్యులు కలిసి గల్ఫ్ కార్మికుల సమస్యలను వివరించారు. ప్రధానంగా నకిలీ ఏజెంట్లను అరికట్టాలని, తద్వారా విదేశీ గడ్డపై వీసాలు లేకుండా అడుగు పెట్టిన భారతీయులకు ఇబ్బంది రాకుండా చూడాలని కోరారు. హైదరాబాద్ నుండి బహ్రెయన్‌కు నేరుగా ఎయిర్ ఇండియా విమాన సర్వీసును నడపాలని కోరారు. విదేశాల్లో కార్మికులుగా ఉంటున్న మన వాళ్లు మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయడానికి, ఉన్నత విద్య అభ్యసించేందుకు వీలుగా గల్ఫ్ దేశాల్లో దేశీయ యూనివర్సిటీల స్టడీ సెంటర్లు, శాఖలను ప్రారంభించేందుకు కృషి చేయాలని కోరారు. భారత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను తెరవాలని హోంమంత్రినిర కోరారు. విదేశాల్లో ఉన్న భారతీయులకు స్వదేశంలో ఓటు హక్కు కల్పించాలని జాగృతి బహ్రెయన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.