తెలంగాణ

ఆదాయ వ్యయాలపై నివేదికలు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్న నిధులు, శాఖల వారీగా సమకూరుతున్న ఆదాయం, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కొత్తగా ఆదాయ మార్గాలపై నివేదికలు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వివిధ శాఖాధిపతులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం వివిధ శాఖల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో రాజీవ్ శర్మ సమావేశమయ్యారు. శాఖల వారీగా ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలని రాజీవ్ శర్మ ఆదేశించారు. ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఒక్కోక్కరూ మూడు నుంచి నాలుగు శాఖలపై శాఖల వారీగా సమాచారాన్ని అందజేయాలని రాజీవ్ శర్మ ఆదేశించారు. వీటిలో వివిధ శాఖలలో పథకాలపై ఖర్చు, ఆయా శాఖలకు లభిస్తున్న ఆదాయం, కేంద్ర ప్రాయోజిత పథకాలు, నిధుల వినియోగ పత్రాల వివరాలను నివేదికలలో పొందుపర్చాలని ఆయన సూచించారు. వివిధ శాఖలలో రావాల్సిన ఆదాయానికి సంబంధించి కోర్టు కేసులు, ప్రభుత్వ భూముల ద్వారా వచ్చే ఆదాయం, కొత్తగా ఆదాయం వచ్చే మార్గాలు, రెవిన్యూ లీకేజిలు, ప్రభుత్వ ప్రతిష్టాతక పథకాలకు నిధుల కేటాయింపు, ఖర్చు, అవసరమై నిధులు తదితర అంశాలపై నివేదికలో పొందుపర్చాలని రాజీవ్ శర్మ ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ చంద్ర, ఎస్‌పి సింగ్, ఎంజి గోపాల్, రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్‌కె జోషి, ముఖ్య కార్యదర్శులు బిపి ఆచార్య, సురేశ్ చంద్ర, రాజేశ్వర్ తివారి, బిఆర్ మీనా, అథర్ సిన్హా, రాజీవ్ త్రివేది, రజత్ కుమార్, కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్, శివశంకర్, జగదీశ్వర్, అనితా రాజేంద్రన్, సవ్వసాచి ఘోష్ తదితరులు పాల్గొన్నారు.