తెలంగాణ

కేంద్ర పథకాల అమలుపై జిల్లా యూనిట్‌గా ప్రతిపాదనలు సిద్ధం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: జిల్లా యూనిట్‌గా కేంద్రం అమలు చేసే పథకాలపై ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా సీనియర్ అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రతీ జిల్లాలో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉండాలని, ఇవ్వే కాకుండా ఇంకా ఏమేమి కేంద్రం నుంచి సాధించుకోవచ్చో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. జిల్లాల్లో పరిపాలనా విభాగాలు సమర్థంగా పని చేసే విధానం రూపకల్పనపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై అధికారులు పరిపాలనపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతీ జిల్లాలో కచ్చితంగా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలకు అవసరమైన విభాగాలను నిర్ణయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విధిగా ఏమేమి ఉండాలనే దానిపై ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతీ జిల్లాలో కచ్చితంగా నిర్వహించే విభాగాలు గుర్తించి కేంద్రానికి నివేదిక పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు శాంతకుమారి, బిపి ఆచార్య, వాకాటి కరుణ, జనార్దన్‌రెడ్డి, రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు, ఎస్ నర్సింగ్‌రావు, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. మంత్రులు, సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్