తెలంగాణ

జనవరి 7న రామయ్యకు తెప్పోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 2017 జనవరి 7న సాయంత్రం గోదావరిలో స్వామికి తెప్పోత్సవం, 8న తెల్లవారుఝామున ఉత్తరద్వారంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు, స్థానాచార్యులు స్థలసాయిలు ఉత్సవ తేదీలను మంగళవారం ఖరారు చేశారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభవౌతాయని వెల్లడించారు. శ్రీ సీతారామచంద్రస్వామికి డిసెంబర్ 29 నుంచి 2017 జనవరి 18వ తేదీ వరకు శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. పగల్‌పత్ ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి డిసెంబర్ 29 నుంచి జనవరి 6వ తేదీ వరకు భక్తులకు మత్స్య, కూర్మా, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీ కృష్ణావతారాల్లో దర్శనం ఇవ్వనున్నారు. దశావతారం కల్కిలో జనవరి 15న దర్శనం ఇస్తారు. జనవరి 7 సాయంత్రం గోదావరిలో స్వామికి తెప్పోత్సవం, 8న తెల్లవారుఝామున ఉత్తరద్వారంలో వైకుంఠ ఏకాదశి వేళ వైకుంఠ ద్వారదర్శనం ఉంటుంది. జనవరి 8 నుంచి 18 వరకు రాపత్ ఉత్సవాలు, జనవరి 19 నుంచి 21 వరకు విలాసోత్సవాలు, జనవరి 24న విశ్వరూప సేవ ఉంటాయని వారు వివరించారు.