తెలంగాణ

అగ్ర నేతలు పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, పాడేరు, అక్టోబర్ 25: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేవలం ఇద్దరు నేతలే హతమైనట్టు స్పష్టమవుతోంది. ఇందులో ఆర్‌కె, గాజర్ల రవి తప్పించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. పోలీసులు మాత్రం ఎన్‌కౌంటర్ జరిగిన కొద్ది గంటలకే మావోయిస్ట్ కీలక నేతలు మరణించినట్టు మీడియాకు సమాచారం అందించారు. ఇందులో చలపతి, అతని భార్య, దయతోపాటు మరికొంతమంది పేర్లు ఉన్నాయి. వీరిపై ఉన్న రివార్డులు ఎంతెంత అన్న విషయాన్ని కూడా వారు బయటపెట్టారు. వాస్తవానికి ఈ ఘటనలో కేవలం ఇద్దరు మావోయిస్ట్ నేతలు మాత్రమే మరణించినట్టు మంగళవారం పోలీసులు నిర్థారించారు. మరణించిన వారిలో గణేష్, దయ ఉన్నారని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల పూర్తి వివరాలను పోలీసులు బహిర్గతం చేయడం లేదు. మరణించిన వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చామని, 72 గంటల్లో వారు రాకపోతే, తామే శవాలను ఖననం చేస్తామని పోలీసులు చెబుతున్నారు. సోమవారం సాయంత్రమే విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ మల్కన్‌గిరికి బయల్దేరి వెళ్లిపోయారు. అక్కడి నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలాఉండగా ఆర్‌కె కుమారుడు మున్నా ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. కుమారుడి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు తల్లి పద్మక్క మల్కన్‌గిరికి బయల్దేరి వెళ్లారు.
బెజ్జంగి ఎన్‌కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్‌కె చత్తీస్‌గఢ్ అడవుల్లోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న మరో కీలక నేత ఉదయ్ (గాజర్ల రవి) కూడా ఆయన వెంట ఉన్నట్టు సమాచారం. కేంద్ర కమిటీ సభ్యుడుగా వ్యవహరిస్తున్న మరో కీలక నేత సుధాకర్ (చలం)తోపాటు ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడైన చలపతి (కైలాసం) ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టు ప్రచారం జరిగినప్పటికీ వీరిద్దరూ తప్పించుకున్నట్టు తెలుస్తోంది.

చిత్రం... ఎన్‌కౌంటర్ నుంచి
తప్పించుకున్న గాజర్ల రవి