తెలంగాణ

నష్టాల నుంచి గట్టెక్కించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది ప్రతి రోజూ గంట అదనంగా పని చేసి రూ. 700 కోట్ల నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించాలని టిఎస్‌ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కోరారు. ఆర్టీసీకి వెనె్నముక లాంటి మియాపూర్ బాడీ బాల్డింగ్ యూనిట్‌ను మంగళవారం సందర్శించిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, ఆర్టీసీని లాభాల బాటలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారన్నారు. ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతి నెల నిధులు విడుదల చేస్తోందన్నారు. ఆర్టీసి ఖర్చును తగ్గించుకుని ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిష్టాకరమైన మియాపూర్ బాడీ బిల్డింగ్‌లో ప్రతి నెల 23 నుంచి 30 బస్సుల బాడీ తయారు చేస్తున్నారన్నారు. ఇతర బాడీ బిల్డింగ్ సంస్ధలో ప్రతి నెల 40 నుంచి 50 బస్సుల బాడీ తయారు చేసే సామర్ధ్యాన్ని పెంచుకున్నాయన్నారు. రాష్ట్రప్రభుత్వ సహాయంతో రూ.300 కోట్లతో 1400 బస్సుల కొనుగోలు ప్రక్రియ చురుకుగా సాగుతోందన్నారు. హైదరాబాద్-నిజామాబాద్, హైదరాబాద్-వరంగల్ మధ్య మినీ ఏసీ బస్సులను ప్రయోగాత్మకంగా ప్రారంభించామన్నారు. ఆర్టీసీ లాభాలను పెంచేందుకు అక్రమ రవాణాపై వేటు వేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు అనుమతి లేకుండా నడిపితే ప్రైవేట్ ఆపరేటర్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించమని ఆయన స్పష్టం చేశారు.
అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రవాణా శాఖకు అధికారాలు ఇచ్చామన్నారు. ఆర్టీసి సిబ్బంది ఆక్యుపెన్సీ రేటును పెంచేందుకు కృషి చేయాలన్నారు. దీని వల్ల ఆర్టీసి నష్టాల ఊబి నుంచి బయటపడుతుందన్నారు.