తెలంగాణ

భద్రాచలం ఆసుపత్రిలో పసికందు మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 25: భద్రాద్రి జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మంగళవారం 25 రోజుల పసికందు అపహరణకు గురైంది. ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. భద్రాచలం శివారు గోళ్లగట్ట గ్రామానికి చెందిన సోయం శాంత 25 రోజుల క్రితం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలోనే ప్రసవించింది. అయితే ఇంటికి వెళ్లాక మంగళవారం తన బాబుకు వైద్యపరీక్షల నిమిత్తం మళ్లీ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చింది. అయితే ప్రసవ సమయం నాటి కాగితాలు కావాలని వైద్యులు సూచించడంతో సోయం శాంతమ్మతో వచ్చిన ఆమె తల్లి గోళ్లగట్టకు వెళ్లింది. శాంతమ్మ తన 25 రోజుల పసికందును పట్టుకుని మాతా,శిశు కేంద్రంలో ఉండగా ఒక మహిళ బాబును ఎత్తుకుని ఆడిస్తానని చెప్పి తీసుకుంది. తర్వాత ఆ మహిళ బాబుతో సహా ఉడాయించింది. కాగా గోళ్లగట్ట నుంచి తిరిగి వచ్చిన శాంతమ్మ తల్లి బిడ్డ గురించి ఆరా తీయగా ఎవరో మహిళ ఎత్తుకుంటానని చెప్పి తీసుకుందని చెప్పగా ఆసుపత్రి ఆవరణ మొత్తం గాలించారు. కానీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. ఇదిలా ఉంటే సరిగ్గా ఏడాదిన్నర క్రితం కూడా ఇదే ఆసుపత్రిలో శిశువు మాయం కాగా పోలీసుల గాలింపులో తిరిగి దొరికింది. ఏరియా ఆసుపత్రిలో పసికందులు మాయం అవుతున్న నేపథ్యంలో తీవ్ర కలకలం మొదలైంది. దీనిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆరా తీశారు. పసికందు ఎలా మాయమైంది? అంటూ వైద్యులను ప్రశ్నించారు. విచారణకు ఆదేశించారు.