ఆంధ్రప్రదేశ్‌

కొత్తగా 5 లక్షల రేషన్ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 27: రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. ప్రజాసాధికార సర్వే పూర్తయిన అనంతరం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలసి మిల్లర్లు, రేషన్ డీలర్లతో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి సునీత మాట్లాడారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులు తీసుకోనివారి రేషన్ కార్డులు రద్దు చేయబోమని స్పష్టంచేశారు. చాలా మంది ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఆరోగ్య కార్డులు, ఉపకార వేతనాల కోసమే రేషన్ కార్డులు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇటువంటి వారు అవసరం లేకపోతే బియ్యం, సరుకులు తీసుకోవద్దని కోరారు. రేషన్ సరుకులను పక్కదారి పట్టిస్తూ అక్రమాలకు పాల్పడే డీలర్లను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రేషన్ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈపోస్ ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థను రాష్ట్రంలో 29వేల షాపులకు విస్తరించి, 90 శాతం రేషన్‌ను పారదర్శకంగా అందిస్తున్నామన్నారు.ప్రతి కుటుంబానికి ఎల్‌పిజి కనెక్షన్ లక్ష్యంగా దీపం పథకం ద్వారా వచ్చే మే నెలలో 25 లక్షల కనెక్షన్లు పంపిణీ చేయనున్నట్టు మంత్రి సునీత చెప్పారు. పోషకాహార లోపాల నివారణ లక్ష్యంగా రాష్ట్రంలోని ఎస్టీ కుటుంబాలకు రేషన్ సరుకులతో పాటు కిలో కందిపప్పు పంపిణీ చేస్తున్నామన్నారు. త్వరలో స్థానిక ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పోషకాహార కిట్లు పంపిణీచేస్తామన్నారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న విద్యుత్తు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సునీత హామీయిచ్చారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయవద్దని సూచించారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్‌కు ఎవరైనా పాల్పడితే తీవ్రంగా పరిగణించి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కస్టమ్ మిల్లింగ్ కొరకు మిల్లర్ల నుండి కోరే బ్యాంక్ గ్యారంటీని రాష్టమ్రంతటా ఒకే విధంగా అమలుచేస్తామన్నారు. మిల్లింగ్ ఛార్జీలను పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.