తెలంగాణ

గురుకులాల్లో లైఫ్ స్కిల్స్ స్టూడియోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: విద్యార్ధులకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను ఇచ్చి ప్రభుత్వ గురుకులాల్లో విద్యాసంచలనానికి తెరతీసిన సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి విద్యార్ధులకు కియోస్క్‌లు కూడా అందుబాటులోకి తెచ్చారు. తాజాగా విద్యార్ధులకు లైఫ్ స్కిల్స్ స్టూడియోలు ఏర్పాటు చేస్తున్నారు. సంప్రదాయ తరగతి గది విద్యాబోధన పద్ధతులతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని విద్యార్ధులకు నిరంతరం విద్యాసదుపాయాలు అందుబాటులో ఉంచేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. లైఫ్‌స్కిల్స్ స్టుడియోలు ప్రతి గురుకుల పాఠశాలలో ఒకటి ఏర్పాటు చేస్తారు. ఈ లైఫ్ స్కిల్స్ స్టుడియోలో డైనింగ్ టేబుల్, మంచం, పరుపులు, టేబుళ్లు, కుర్చీలు, ప్లేట్లు, ఇతర వంట సామగ్రీ, భోజన సామగ్రీ, వార్డురోబ్, డ్రెస్సింగ్ టేబుల్ తదితర అంశాలను ఈ స్టుడియోలో ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్ధులను ఈ స్టుడియోలోకి తీసుకువచ్చి నిత్యవ్యవహారాల్లో ప్రవర్తనలను నేర్పిస్తారు. దాంతో పాటు సంభాషణ, పెద్దలతో వ్యవహరించాల్సిన తీరు, వ్యక్తిగత వస్తధ్రారణ, నలుగురితో పాటు ఉన్నపుడు ఎలా ప్రవర్తించాలనే విషయాలపై కూడా విద్యార్థులకు తర్ఫీదు ఇస్తారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, టెలిఫోన్ సంభాషణ తీరు వంటి అంశాలపై కూడా నైపుణ్య శిక్షణ ఉంటుంది. గురుకులాల్లో చేరే విద్యార్ధులు సహజంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల వారు కావడం వల్ల వారిలో సహజసిద్ధమైన ఆత్మన్యూనతా భావాన్ని పారద్రోలేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని సాంఘిక సంక్షేమ పాఠశాలల కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. తొలుత ఈ స్టుడియోను నార్సింగి పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ సొసైటీకి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మంత్రి జి జగదీశ్వరరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎంపిక చేసిన కొంత మంది టీచర్లకు ఎ-క్యూబ్ సంస్థకు చెందిన ప్రతినిధులు సుమ, అనిల్ వాసుదేవన్‌లు శిక్షణ ఇచ్చారు. వారు మిగిలిన టీచర్లకు, విద్యార్ధులకు శిక్షణ అందిస్తారని కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.