తెలంగాణ

మార్కెట్ కమిటీల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: పలు మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమిస్తూ శుక్రవారం మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బీరవెల్లి ఉమారెడ్డి, వైస్ చైర్మన్‌గా హోలం చంద్రమోహన్‌ను నియమించారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గుండేటి ఐలయ్య యాదవ్, వైస్ చైర్మన్‌గా మాదారపు ఆంజనేయ రావులను నియమించారు. మరిన్ని మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమించేందుకు కసరత్తు సాగించారు. శనివారం రోజున దీపావళి కానుకగా మరిన్ని మార్కెట్ కమిటీలకు పాలక వర్గాల నియామకం జరుగుతుంది. దీనిపై మంత్రి హరీశ్‌రావు కసరత్తు సాగిస్తున్నారు.