తెలంగాణ

దివ్యాంగురాలు సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, అక్టోబర్ 28: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలోని మాండ్రా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధమవ్వడంతో అందులో ఉన్న పోలియో వికలాంగురాలైన బాషబోయిన సుజాత (15) సజీవదహనమైన దారుణ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు బాషబోయిన యాదయ్య, రాములమ్మలు వడ్డెర వృతి పనిచేస్తూ జీవిస్తున్నారు. వికలాంగురాలైన కూతురు సుజాతను గుడిసెలోనే వదిలి తల్లి రోజువారిగా రాళ్లు కొట్టే పనికి వెళ్లగా, తండ్రి మరో పనిపై హైద్రాబాద్ వెళ్లాడు. సాయంత్రం 3-30ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌తో గుడిసెకు మంటలంటుకోగా గుడిసెలో ఉన్న సుజాత సజీవ దహనమైంది. పూరి గుడిసెకు ఇరుగుపొరుగు ఇళ్లు దూరంగా ఉండటం ఆ ఇళ్లలోని వారు సైతం కూలీపనికి వెళ్లడంతో మంటలు రేగిన సమయంలో ఎవరు గమనించలేదు. పూర్తిగా గుడిసె దగ్ధమైపోయాక గుడిసె కొద్ది దూరంలో మరో ఇంటిలో నివసిస్తున్న సుజాత అమ్మమ్మ గుడిసె వద్దకు వచ్చి చూసి తగులబడిపోయిన గుడిసెను చూసి కేకలేసింది. ఇరుగు పొరుగువారు ఈ సమాచారాన్ని తల్లిదండ్రులకు అందించగా వారు పరుగున వచ్చి జరిగిన దారుణాన్ని చూసి బోరున విలపించారు. యాదయ్య, రాములమ్మలకు సుజాత రెండో కూతురు. ఈ సంఘటనపై ఎస్‌ఐ గోవర్ధన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

చిత్రం.. పూరిల్లు దగ్ధమైన ఘటనలో సజీవ దహనమైన దివ్యాంగురాలు బాషబోయిన సుజాత