తెలంగాణ

ముదురుతున్న హోంగార్డుల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: హోంగార్డుల సమస్యల పరిష్కారం అంశం రోజు రోజుకూ ముదురుతోంది. హోంగార్డులకు ప్రతిపక్షాలన్నీ బాసటగా నిలిచాయి. హోంగార్డుల డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి దీపావళి పండుగ తర్వాత ఇందిరాపార్కు వద్ద మూడు రోజులు లేదా 48 గంటల పాటు దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. హోంగార్డుల సంక్షేమ సంఘానికి గౌరవ అధ్యక్షునిగా ఉన్న కిషన్‌రెడ్డిని శుక్రవారం సుమారు 50 మంది హోంగార్డులు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. కిషన్‌రెడ్డి వారితో మంతనాలు జరిపినప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ, హోం గార్డులకు మద్దతుగా పండుగ తర్వాత దీక్ష చేపడతానని ప్రకటించారు. హోం గార్డులు నాంపల్లి బిజెపి కార్యాలయానికి చేరుకోవడంతో, ఇంటెలిజెన్స్, ఎస్‌బి సమాచారం అందుకున్న పోలీసులు బిజెపి కార్యాలయానికి చేరుకున్నారు. హోం గార్డులను అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారన్న ప్రచారం జరగడంతో మీడియా కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్లు తరలి వచ్చారు. కాగా కిషన్ రెడ్డి కార్యాలయం గేటు బయటకు వచ్చి అక్కడున్న పోలీసులను నిలదీశారు. తాను చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని తాపత్రయపడుతుంటే మీరంతా ఎందుకు వచ్చారని వారిని ప్రశ్నించారు. హోం గార్డుల సమస్యలను పరిష్కరించేందుకు తాను డిజిపితో, నగర పోలీసు కమిషనర్‌తో సమావేశమవుతానని చెప్పారు. ముఖ్యమంత్రితో మాట్లాడాలనుకున్న అప్పాయింట్ లభించదని ఆయన తెలిపారు.
సర్వీసును రెగ్యులరైజ్ చేయాలి
ఇలాఉండగా కిషన్‌రెడ్డి పార్టీ నాయకులు ప్రకాశ్‌రెడ్డి, ఎస్. కుమార్‌తో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ హోం గార్డుల సర్వీసును తమిళనాడు తరహాలో రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇఎస్‌ఐ, పిఎఫ్, వారాంతపు సెలవు, బస్‌పాసు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
అప్పుడేమన్నారు?: రేవంత్ ప్రశ్న
ఎన్నికలకు ముందు హోంగార్డుల గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా గొప్పగా చెప్పారని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే హోంగార్డులను పోలీసులుగా ప్రమోషన్ కల్పిస్తామని, పోలీసులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారని ఆయన గుర్తు చేశారు. ట్రాఫిక్‌లో పని చేసే కానిస్టేబుళ్ళకు 30 శాతం అదనపు వేతనాన్ని చెల్లిస్తున్న ప్రభుత్వం హోంగార్డులకు ఎందుకు కల్పించడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, వైకాపా తదితర పార్టీలన్నీ హోం గార్డులకు మద్దతు ప్రకటించాయి. వారికి వారాంతపు సెలవు ఇవ్వాలని, పోలీసులతో సమానంగా వేతనం చెల్లించాలని డిమాండ్ చేశాయి.