తెలంగాణ

ఏపీని ఒప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: సచివాలయంలో ఆంధ్రకు కేటాయించిన భవనాలు త్వరగా తెలంగాణకు అప్పగించేలా చొరవ చూపాలని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు సిఎం కె చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఈనెల 31న జరుగనున్న ఏపీ కేబినెట్‌లో సానుకూల తీర్మానం చేసేలా చూడాలని కోరారు. సిఎం కెసిఆర్ శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లి ఉమ్మడి గవర్నర్‌తో సమావేశమయ్యారు. భేటీలో రెండు అంశాలపై గవర్నర్‌తో సిఎం చర్చించినట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా సచివాలయం నిర్మించనున్న నేపథ్యంలో, ప్రస్తుత భవనాలను కూల్చివేయడానికి వీలుగా ఏపీకి కేటాయించిన భవనాలనూ అప్పగిస్తే తమ పని సులువవుతుందని కెసిఆర్ కోరినట్టు తెలిసింది. ఉమ్మడి రాజధానిలో ఆంధ్ర ప్రభుత్వానికి పదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉండటంతో, వారి అవసరార్థం ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతంలో భవనాల కేటాయింపునకు సిఎం ప్రతిపాదించినట్టు తెలిసింది. ఆంధ్ర మంత్రిమండలి సమావేశానికి ముందే వారికి ఇవ్వడానికి ప్రతిపాదించిన భవనాల వివరాలు అందించాలని గవర్నర్‌ను కోరినట్టు సమాచారం. సచివాలయంలో ఆంధ్రకు కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించే అంశం తేలితే, తాము కొత్తగా నిర్మించబోయే సచివాలయంపై స్పష్టత వస్తుందని సిఎం అభిప్రాయపడినట్టు తెలిసింది. ఆంధ్ర సచివాలయం ఇప్పటికే అమరావతికి తరలివెళ్లడంతో, సచివాలయంలో ఆ రాష్ట్రానికి కేటాయించిన భవనాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని, అవసరం లేని భవనాలను తెలంగాణకు అప్పగించడానికి ఆ రాష్ట్రం సానుకూలంగా ఉన్నట్టు సంకేతాలు అందాయని ఉమ్మడి గవర్నర్‌కు సిఎం కెసిఆర్ వివరించినట్టు తెలిసింది. భవనాల అప్పగింతపై అధికారికంగా నిర్ణయం వెలువడేలా చేస్తే సచివాలయం తరలింపు, ప్రస్తుత భవనాల కూల్చివేత, కొత్త భవన నిర్మాణం తమకు సులభతరం అవుతుందని కెసిఆర్ కోరినట్టు చెబుతున్నారు. ఢిల్లీలో ఏపీ భవన్ తరహాలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనూ తమకు అలాంటి భవనం కావాలని ఆంధ్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం అందిందని గవర్నర్‌కు సిఎం కెసిఆర్ వివరించినట్టు తెలిసింది. ఆ రాష్ట్రానికి సంబంధించిన కార్యాలయాల నిర్వహణ కోసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనం అవసరం ఉంటుందని ఆర్ అండ్ బి శాఖ అంచన వేసిందని చెప్పినట్టు తెలిసింది. దీనికోసం శాసనసభకు ఎదురుగా ఆకాశవాణి కేంద్రం పక్కనున్న హెరిటేజ్ భవనాన్ని కేటాయించనున్నట్టు సిఎం ప్రతిపాదించారని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆంధ్ర సిఎం చంద్రబాబుతో చర్చించనున్నట్టు గవర్నర్ నరసింహన్ చెప్పారని తెలిసింది.