రాష్ట్రీయం

శాంతిభద్రతల దృష్ట్యా హైదరాబాద్‌లో హైఅలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: ఓ వైపు భారత్-పాక్ సరిహద్దుల్లో కాల్పులు, దేశంలో ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా వర్గాల హెచ్చరికలు, మరోవైపు ఏవోబిలో భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. శాంతిభద్రతల దృష్ట్యా నగరంలో ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఈనెల 30 నుంచి నవంబర్ 5వరకు అమలులో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించరాదని, కత్తులు, తుపాకులువంటి మారణాయుధాలతో సంచరించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్లపై ప్రజలు గుంపులుగా ఉండరాదని, సాధారణ ప్రజలకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. నాంపల్లి ఐమాక్స్, నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం తదితర ప్రాంతాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. హై వాల్యుమ్ సౌండ్ సిస్టంను వాడకూడదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ఇబ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.